నాగశౌర్య మూవీకి ఇళయరాజా మ్యూజిక్
Send us your feedback to audioarticles@vaarta.com
ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీ రావే మా ఇంటికి, జాదుగాడు..ఇలా యూత్ ఫుల్ మూవీస్ తో ఆకట్టుకుంటున్న యువ హీరో నాగశౌర్య. రమేష్ వర్మ దర్శకత్వంలో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం అబ్బాయితో అమ్మాయి. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభిస్తోంది.
ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించడం విశేషం. ఈ ఆడియోను నవంబర్ ఫస్ట్ వీక్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆడియో వేడుకకు ఇళయరాజా హాజరవుతున్నట్టు సమాచారం. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన అబ్బాయితో అమ్మాయి చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments