Ilaiyaraaja:ఇళయరాజా తీవ్ర ఆగ్రహం.. 'మంజుమ్మల్ బాయ్స్' యూనిట్‌కి నోటీసులు

  • IndiaGlitz, [Thursday,May 23 2024]

ఇళయరాజా సంగీత ప్రియులకు ఓ వ్యసనం లాంటి వారు. ముఖ్యంగా 80, 90 దశకాల్లో తెలుగు, తమిళ్ సినిమాలకు ఎన్నో గొప్ప పాటలకు సంగీతం ఇచ్చారు. ఇప్పటికి చాలామంది మ్యాస్ట్రో పాటలే వింటూ ఉంటారు. ఎంతో మంది సంగీత దర్శకులు ఆయనను ఆచరిస్తూ ఉంటారు. అభినందిస్తూ ఉంటారు. కానీ అలాంటి దిగ్గజ వ్యక్తి ఇటీవల ఓ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే తన పాట ఎవరు ఏ రకంగా వాడినా వాళ్లకు లీగల్ నోటీసులు పంపుతున్నారు. గతంలో ఏకంగా దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలుకి అమెరికా ఈవెంట్స్ లో తన పాటలు వాడారని లీగల్ నోటీసులు పంపారు. దీంతో ఆ వ్యవహారం చాలా సంచలనంగా మారింది.

ఇద్దరు ఎప్పట్నుంచో మంచి స్నేహితులుగా ఉండేవారు. ఇళయరాజా అందించిన ఎన్నో పాటలను ఎస్పీబీ పాడారు. అలాంటి ఎస్పీ బాలుకే నోటీసులు పంపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక అప్పటి నుంచి ఏదైనా సినిమాల్లో, వేరే చోట్ల కానీ తన పాటలని, సంగీతాన్ని ఎవరైనా వాడితే వాళ్లకు లీగల్ నోటీసులు పంపిస్తున్నారు. తన పర్మిషన్ తీసుకోలేదని, తనకు డబ్బులు చెల్లించాలని, తనకి క్రెడిట్స్ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంటున్నారు. ఈ విషయంలోనే ఇళయరాజా తీవ్ర విమర్శల పాలవుతున్నారు. ఇప్పటికే తన పాటలను వాడిన పలు సినిమాలకు నోటీసులు పంపారు.

తాజాగా మలయాళం సూపర్ హిట్ సినిమా 'మంజుమ్మల్ బాయ్స్' యూనిట్‌కి నోటీసులు పంపించారు. ఈ సినిమాలో కమల్ హాసన్ నటించిన గుణ సినిమాలోని కమ్మని ఈ ప్రేమ లేఖనే.. పాటని వాడారు. మలయాళ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ పాటనే వాడారు. దీంతో తన పర్మిషన్ లేకుండా తన పాట ఎందుకు వాడుకున్నారని.. తనకు నష్టపరిహారం 15 రోజుల్లోగా చెల్లించాలని లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని నోటీసులు అందించారు. దీంతో మూవీ టీమ్ షాక్ అయింది. వాస్తవంగా మంజుమ్మల్ బాయ్స్ సినిమా మొదట్లో స్పెషల్ థ్యాంక్స్ అని ఇళయరాజాకు, కమల్ హాసన్‌కు క్రెడిట్స్ కూడా ఇచ్చారు. అయినా కానీ ఇళయరాజా నోటీసులు పంపించడం గమనార్హం. ఇళయరాజా వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పాట వాడుకున్నందుకు ఇంకా మెచ్చుకోవాల్సింది పోయి ఇలా లీగల్ నోటీసులు పంపడం ఎంతవరకు సమంజం అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

More News

Pinnelli:పిన్నెల్లి కోసం పోలీసులు ముమ్మర వేట.. ఈసీకి డీజీపీ నివేదిక..

పోలింగ్ ముగిసినా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఘర్షణలు మాత్రం ఇంకా తగ్గడం లేదు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయ్ గేట్‌ పోలింగ్ కేంద్రంలో

Bharatiyadu 2:‘భార‌తీయుడు 2’... నుంచి లిరికల్ సాంగ్ ‘శౌర..’ రిలీజ్

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో

Janmabhoomi Express: జన్మభూమి రైలు నుంచి తెగిపోయిన బోగీలు.. తప్పిన పెను ప్రమాదం..

విశాఖపట్నం నుంచి లింగంపల్లి రావాల్సిన జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరిన కొద్దిసేపటికే నిలిచిపోయింది. ఫ్లాట్‌ఫాం నుంచి మొదలైన రెండు నిమిషాలకే రైలును హుటాహుటిన నిలిపివేయాల్సి వచ్చింది.

CM Revanth Reddy: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా శ్రీవారికి తన మనవడి తలనీలాల మొక్కు చెల్లించారు. అనంతరం ఉదయం 8.30గంటలకు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో

YCP MLA:ఈవీఎం ధ్వంసం చేసిన వైసీపీ ఎమ్మెల్యేపై కేసు.. అరెస్ట్ చేసే అవకాశం..

ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహంగా ఉంది.