వాలెంటెన్స్ డే కానుకగా 'ఇక సె..లవ్'
Tuesday, January 17, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
గ్రీన్సన్ ఇన్నోవేటివ్ పతాకంపై జైహిత సమర్పణలో సాయి, దీప్తి హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం `ఇక సె..లవ్`. ఈ చిత్రం అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విజయదశమికి రిలీజ్ కావాల్సి ఉండగా, చిత్రానికి సెన్సార్ నుండి చుక్కెదురైంది. ఆర్.సి ద్వారా అనుమతి పొంది ఫిబ్రవరి 10, 2017న రిలీజ్ కానుంది. మొదటి సినిమా రిలీజ్ అయితే సమాజానికి చేటు చేస్తుందని, ఈ చిత్రంలో నైతిక విలువలు లేవని, వివాహ వ్యవస్థ మీద గౌరవం లేనట్లుగా, ఈ చిత్ర కథాంశం ఉందన్న కారణాలతో ఈ సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డ్ తిరస్కరించింది. కానీ చిత్ర దర్శక నిర్మాతలు ఆర్.సి కి వెళ్లి అనుమతి పొంది విజయవంతంగా సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....
చిత్ర దర్శకుడు నాగరాజ్ మాట్లాడుతూ ... సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వకుండా రిజెక్ట్ చేసే అధికారం సెన్సార్ బోర్డుకు లేదని, అలా చేయడం తమ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ను ని భంగపరిచినట్టే. బ్యానర్‌ను బట్టి, హీరోను బట్టి దర్శక నిర్మాతలను బట్టి సెన్సార్ రూల్స్ మారతాయా. ఈ చిత్రాన్ని స్త్రీ స్వేచ్చ మహిళాభ్యుదయం ధృక్కోణంలో చూడాలి. అనివార్య కారణాలో ఇనిమా విడుదల ఆలస్యమైనా, వాలెంటెన్స్‌డే సందర్భంగా సినిమాను ఫిబ్రవరి 10న విడుదల చేస్తున్నామని తెలిపారు.
ఈ చిత్రానికి సంగీతంః మధు, కెమెరాః వి.శ్రీనివాసరెడ్డి, ఎడిటింగ్ః నాగిరెడ్డి, నిర్మాతలుః గన్నవరపు చంద్రశేఖర్, డుంగ్రోతు పీర్యానాయక్, గ్యార రవి, రచన, దర్శకత్వః నాగరాజ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments