కరోనా వైరస్ ప్రభావం వల్ల విధించిన లాక్‌డౌన్‌తో చాలా సినిమాలకు ఓటీటీలకే ప్రధాన మాధ్యమాలుగా మారాయి. ముఖ్యంగా కొత్తవారు ఓటీటీ మాధ్యమాలతో ప్రేక్షకులను రీచ్ కావడం సులభతరమైందనే చెప్పాలి. అలా ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల ముందుకు చాలా సినిమాలే వచ్చాయి. ఈ లిస్టులో రీసెంట్‌గా చేరిన సినిమా ఐఐటీ కృష్ణమూర్తి. కొత్త నటీనటులు, మేకర్స్, దర్శకుడు చేసిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరి సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం...
కథ:
కృష్ణమూర్తి ముంబైలో ఐఐటీ చదువుతుంటాడు. తన బాబాయ్‌ని వెతుక్కుంటూ హైదరాబాద్ వస్తాడు. అతన్ని ప్రేమించే అమ్మాయి జాహ్నవి(మైరా దోషి) హైదరాబాద్ వస్తుంది. తన బాబాయ్ తప్పిపోయాడని కృష్ణమూర్తి పేపర్ యాడ్ ఇస్తాడు. అది చూసిన ఏసీపీ (వినయ్ వర్మ) ..కృష్ణమూర్తిని పిలిచి మాట్లాడుతాడు. కేసు ఫైల్ చేసి వివరాలను సేకరించే పనిలో ఉంటాడు. అంతకు నెల ముందే ఓ అనాథ శవం దగ్గర దొరికిన ఆనవాళ్లు బట్టి కృష్ణమూర్తి బాబాయ్ చనిపోయాడంటూ పోలీసులు నిర్దారించి విషయాన్ని కృష్ణమూర్తికి కూడా చెబుతారు. అదే సమయంలో కృష్ణమూర్తికి ఎవరో ఫోన్ చేసి బెదిరిస్తారు. అతన్ని వెండిస్తుంటారు. ఈ వివరాలను కృష్ణమూర్తి ఏసీపీకి చెబుతాడు. ఏసీపీకి కూడా అదే తరహా బెదిరింపు కాల్ వస్తుంది. అసలు కృష్ణమూర్తి బాబాయ్ ఎవరు? నిజంగానే చనిపోయాడా? కృష్ణమూర్తిని బెదిరించింది ఎవరు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
డెబ్యూ డైరెక్టర్స్, కొత్త నటీనటులు సినిమా చేయాలనుకున్నప్పుడు థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో చేసే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతారు. తక్కువ బడ్జెట్‌లో పూర్తి కావడం.. ప్రేక్షకుడికి కట్టిపడేసేలా సినిమాను తెరకెక్కిస్తే మంచి పేరుతో ఇండస్ట్రీలో రాణించే అవకాశం ఉంటుందని భావిస్తారు. అదే ఆలోచనతో శ్రీవర్ధన్ ఐఐటీ కృష్ణమూర్తి సినిమాను తెరకెక్కించారు. సినిమాలో ఎక్కడా ఎక్కువ పాత్రలను పెట్టి గందగోళం క్రియేట్ చేయాలని అనుకోలేదు. డైరెక్టర్ దాచిపెట్టిన సస్పెన్స్‌ను చివరి వరకు తీసుకు పోవడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అయితే మరింత గ్రిప్‌గా తెరకెక్కించాల్సింది అనుకోవాలి. కానీ ఆ విషయంలో డైరెక్టర్ శ్రీవర్ధన్ సక్సెస్ కాలేదు. సినిమాను బాగా సాగదీశాడనే చెప్పాలి. డైరెక్టర్స్ లాజిక్స్ మిస్ అయ్యాడని తెలుస్తుంది. ఇక హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్‌కు, కథకు లింక్ లేకుండా సాగుతుంది. పాటలు కూడా అంతే. పాటలు కూడా వినడానికి అంత బాగాలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ పరావాలేదు. సినిమాటోగ్రఫీ ఓకే. నటీనటుల విషయానికి వస్తే హీరో పృథ్వీ లుక్ పరంగా బావున్నాడు. కథానుగుణంగా పాత్రను చక్కగా క్యారీ చేశాడు. హీరోయిన్ లుక్స్ పరంగా బావుంది. కానీ ఆమె పాత్ర ఏదో వచ్చిపోతున్న భావన కలుగుతుంది. పాత్రకు తగ్గ ఎలివేషన్ లేదనే చెప్పాలి. ఇక సత్య పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. ఏదో ఓ పాత్ర పెట్టాలనే ఆలోచనతో ఈ పాత్రను చేర్చినట్లు అనిపిస్తుంది.
చివరగా.. ఐఐటీ కృష్ణమూర్తి.. సినిమా కంటే ట్రైలరే బావుంది
Comments