ఆర్జీవీకి అదిరిపోయే కౌంటరిచ్చిన ‘ఐఎఫ్ఎస్’!!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తన ట్విట్టర్ వేదికగా తాజాగా ఓ ఆసక్తికర ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఓ వ్యక్తి జింకలను కాల్చుతూ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసిన ఆయన.. బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్‌కు ఈ వీడియోలో ఉన్న వ్యక్తికి లింక్ పెడుతూ ట్వీట్ చేశారు. జింకల వేట కేసులో.. సల్మాన్ ఖాన్‌ను పోలీసులు, కోర్టులు వెంటాడుతున్నాయ్ సరే.. మరి ఇదిగో ఈ వీడియోలో చూస్తున్న బాస్టడ్‌ను ఎందుకు పట్టుకోవట్లేదు..? ఏం చేస్తున్నారు..? ఆయన యార్డ్ ముందు ఇలా షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడే.. మరి పోలీసులు, కోర్టులు ఏం చేస్తున్నాయ్..? పోలీసులు, కోర్టులు ఏం చేస్తాయో చెప్పండి..? అని ట్విట్టర్ వేదికగా ఆర్జీవీ డిమాండ్ చేశారు.
అదిరిపోయే కౌంటర్!
ఇందుకు ఓ ప్రవీణ్ కశ్వన్ అనే ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్) ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్‌గానే రియాక్ట్ అయ్యారు. దీన్ని రియాక్ట్ అనడం కంటే అదిరిపోయే కౌంటర్ అనడం ఇంకా బెటరేమో మరి. ‘ఎస్ సార్ మీరు అడిగినది వాస్తవమే కానీ.. మీరు అడగాల్సింది మన పోలీసులు, కోర్టులను కాదు. మీరు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో.. అది బంగ్లాదేశ్ పోలీసులను అడిగితే మంచిది. ఇంకా చెప్పాలంటే ఈ ఘటన జరిగిన చిట్టగాంగ్ పోలీసులను అడిగితే మరీ మంచిది’ అని ఆర్జీవీ ట్వీట్‌కు ఐఎఫ్ఎస్ రిప్లై ఇచ్చారు. వాస్తవానికి ఈ ఘటన జరిగింది.. బంగ్లాదేశ్‌లో.. ఇప్పటికే ఈ వీడియో వైరల్ అవ్వగా.. కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ ఇది మనదేశంలో జరగలేదని క్లారిటీ కూడా ఇచ్చుకుంది.
రిప్లై ఎలా ఉంటుందో..!
ఈ ట్వీట్ చూసిన పలువురు నెటిజన్లు చిత్రవిచిత్రాలుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. హవ్వా.. ఏమైనా కౌంటరిచ్చారా.. సారూ.. ఆర్జీవీకి దిమ్మతిరిగిపోయింది పో అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి తన ట్వీట్‌కు రిప్లై, కౌంటర్లిచ్చే వారికి తనదైన శైలిలో విమర్శలు గుప్పించడంలో దిట్ట అయిన ఆర్జీవీ ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో..!
Certainly. But you need to ask this from police of Bangladesh. Because that is from where the video is. From Chittagong to be precise.
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) January 28, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments