జగన్ అధికారంలోకి వస్తే మంత్రులు వీరే.. జాబితా హల్‌చల్!
- IndiaGlitz, [Saturday,May 11 2019]
ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్-11న జరిగిన ఎన్నికలకుగాను మే-23న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే మరోసారి విజయం మాదే.. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలే టీడీపీని రెండోసారి గెలిపిస్తాయని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అండ్ కో ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలు మేం ఏప్రిల్-11నే గెలిచేశామని.. ఇక అధికారికంగా మే-23న ప్రకటన రానుందంతే అని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అంతేకాదు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం ధీమా వ్యక్తంచేస్తున్నారు. 2014లో మిస్సయిన సీఎం పీఠం.. ఈసారి కచ్చితంగా తమదేనని వైసీపీ నేతలు ఫుల్ కాన్ఫిడెన్స్‌లో ఉన్నారు.
అంతేకాదండోయ్.. గెలిచేది మేమే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మేమే.. అంటూ అదేదో సామెత ఉంది కదా.. ఆలు లేదు సూలు లేదు.. అల్లుడి పేరు సోమలింగం అన్నట్లుగా.. అప్పుడే వైసీపీ నేతలు మంత్రి పదవులు కూడా పంచేసుకుంటున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే.. ఫలానా నేతకు ఈ శాఖ ఇవ్వొచ్చు.. అని కొందరు వీరాభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పోస్ట్‌లు పెట్టేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. అయితే వైసీపీ కార్యకర్తలు, అభిమానుల అత్యుత్సాహాన్ని అంతే రీతిలో అటు జనసేన.. ఇటు టీడీపీ కార్యకర్తలు తిప్పి కొడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సోషల్ మీడియాలో ఎన్నికలు అయిపోయినా వైసీపీ-టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేంతగా పరిస్థితులు నెలకొన్నాయి.
నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న వైసీపీ నేతల మంత్రులు జాబితా ఇదే..
1. అసెంబ్లీ స్పీకర్ : దగ్గుపాటి వెంకటేశ్వరరావు
2. హోం శాఖ : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
3. రెవెన్యూ శాఖ : ధర్నాన ప్రసాద్
4. ఆర్థిక శాఖ : బుగ్గున రాజేంద్ర నాథ్ రెడ్డి
5. వ్యవసాయ శాఖ : ఆళ్ల రామక్రిష్ణారెడ్డి
6. దేవదాయ శాఖ : కోన రఘుపతి
7. మైనార్టీ సంబంధిత శాఖ: కర్నూలు లేదా చిత్తూరు జిల్లాకు చెందిన ముస్లిం అభ్యర్థులు
8. ఐటీ శాఖ : గడికోట శ్రీకాంత్ రెడ్డి
9. సినిమాటోగ్రఫీ : ఆర్కే రోజా
10. విద్యుత్ శాఖ : మర్రి రాజశేఖర్
ఇదిలా ఉంటే.. కొడాలి నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభానుకు వైఎస్ జగన్ కేబినెట్‌లో చోటు ఉంటుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే మే-23న ఫలితాలొస్తే గానీ అసలు సీన్ ఏంటో అర్థమవుతుందన్న మాట. సో.. ఎవరు సీఎం సీటులో కూర్చుంటారు..? ఎవరు ప్రతిపక్షనేతగా మిగిలిపోతారు..? ఎవరు కింగ్ మేకర్ అవుతారు..? అనేది తెలియాలంటే మే-23 వరకు వేచి చూడాల్సిందే మరి.