Chandrababu:జగన్ను మరోసారి నమ్మితే రాష్ట్రం అధోగతి పాలు: చంద్రబాబు
Send us your feedback to audioarticles@vaarta.com
తల్లిని, చెల్లిని చూడలేని వ్యక్తి రాష్ట్రాన్ని చూస్తారా? అని సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్ను మరోసారి నమ్మితే రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు. ఇప్పటికే 30 ఏళ్లు రాష్ట్రం వెనక్కు వెళ్లిపోయిందని.. మరోసారి అలాంటి తప్పు చేయవద్దు అని ప్రజలకు పిలుపునిచ్చారు. సర్వేపల్లిలో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో యువతకు ఇక ఉద్యోగాలు దొరికే పరిస్థితి ఉండదన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు గెలవాలని రాష్ట్రం నిలబడాలని కోరారు.
రాష్ట్రంలో క్లాస్ వార్ కాదని, క్యాష్ వార్ నడుస్తుందని చంద్రబాబు తెలిపారు.రాష్ట్రంలో ఉన్న డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్లోకే వెళుతుందని ఆరోపింఆచరు. అభివృద్ధి అనేది జగన్ పాలనలో అస్సలు కనిపించిందా? అంటూ ప్రశ్నించారు. ఎండల బాదుడు కంటే వైసీపీ ప్రభుత్వ బాదుడే ఎక్కువగా ఉందని ఈ సభను చూస్తే అర్థమవుతోందని పేర్కొన్నారు. ఈ ముఖ్యమంత్రికి ఒళ్లంతా అహంకారమని.. ఎక్కడికక్కడ దోచుకోవడం తప్ప ఇంకేమీ తెలియదని మండిపడ్డారు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందన్నారు.
కోర్టుల్లో ఫైళ్లను కాజేసిన వ్యక్తి కాకాణి గోవర్థన్ రెడ్డి అని ఈసారి అతనిని ఓడించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కేజీఎఫ్-3 చూడాలంటే సర్వేపల్లికి రావాలని.. కేజీఎఫ్ అంటే కాకాణి గోవర్ధన్ ఫీల్డ్స్ అని విమర్శించారు. ఈ అవినీతి మంత్రి ఎంత లోతుకు కూరుకుపోయాడంటే... మళ్లీ పైకొచ్చే అవకాశమే లేదు... శాశ్వతంగా గోతిలోనే ఉంటాడని హెచ్చరించారు. మంత్రి దోచిన ఈ సహజవనరులే నీ రాజకీయ జీవితానికి సమాధి కట్టబోతున్నాయి... ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండమని చంద్రబాబు హెచ్చరించారు.
ఇక తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని, తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి రూ.15వేలు అందిస్తామన్నారు. ఐదేళ్లలో 20లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే మూడు పార్టీలు కలిశాయని వివరించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రాష్ట్రం కోసమే చేతులు కలిపారని చెప్పుకొచ్చారు. సార్వత్రిక ఎన్నికలలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు కోరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments