Voter Slip: ఓటర్ స్లిప్ లేదా..? ఏం పర్లేదు.. ఇలా చేసి ఓటు వేయండి..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇప్పటికే మొదలైంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పల్లె నుంచి నగరాల వరకు ఓటు వేసేందుకు ఓటర్లు క్యూకడుతున్నారు. అయితే కొంతమందికి ఇప్పటికీ ఓటర్ల స్లిప్పులు అందలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే ఓటర్ స్లిప్ లేనంత మాత్రాన ఓటు హక్కు కోల్పోవాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఓటర్ స్లిప్ రాకపోయినా, మీ పోలింగ్ బూత్ ఎక్కడుందో తెలుసుకొని ఓటు హక్కును వినియోగించుకోవచ్చని చెబుతున్నారు.
మీ పోలింగ్ బూత్ వివరాలు ఎలా తెలుసుకోవాలంటే..
*మీ ఓటరు గుర్తింపు కార్డుపై ఉన్న నెంబర్‌ను 1950, 9211728082 నంబర్లకు SMS రూపంలో పంపించాలి. వెంటనే మీ పోలింగ్ కేంద్రం వివరాలు ఎస్సెమ్మెస్ రూపంలో వస్తాయి. అంతేకాకుండా 1950 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు.
*ఓటర్ హెల్ప్‌లైన్’ యాప్ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు. ఎన్నికల సంఘానికి చెందిన ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోని మీ ఓటరు గుర్తింపు కార్డు నెంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా వివరాలు పొందొచ్చు.
*అలాగే ఎన్నికల సంఘం వెబ్‌సైట్స్ www.ceotelangana.nic.in లేదా www.electoralsearch.eci.gov.in ద్వారా కూడా పోలింగ్ కేంద్రాలను తెలుసుకోవచ్చు. అందులో ఉండే Ask Voter Sahaya Mithra చాట్‌బాట్ ద్వారా కూడా వివరాలు పొందవచ్చు.
ఒకవేళ మీర ఓటు వేయడానికి ఓటర్ కార్డు లేకపోయినా ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్నారు. ఆధార్ కార్డు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, కేంద్ర, రాష్ట్ర, పబ్లిక్ సెక్టార్, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల ఫొటో గుర్తింపు కార్డు, ఫొటోతో కూడిన పోస్టాఫీస్ లేదా బ్యాంక్ పాస్‌బుక్, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌కార్డు, ఫొటోతో జత చేసిన పింఛను పత్రాలు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం వంటి వాటిలో ఏదైనా చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments