ఈ విషయం తెలిస్తే మాస్క్ లేకుండా బైక్‌పై ఎట్టి పరిస్థితుల్లో తిరగరు!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా సమయంలో మాస్క్ తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా మాస్క్ లేకుండా బైక్‌పై కనిపిస్తే ఆపి ఫైన్ వేస్తోంది. అయితే మా ఏరియాలో నిఘా పెద్దగా లేదు.. పోలీసులు కనిపించడం లేదులే అని నిర్లక్ష్యంగా మాస్క్ లేకుండా తిరిగారో అడ్డంగా బుక్కైపోతారు. ప్రతి ఏరియాలోనూ పోలీసులు సీసీ అమర్చిన విషయం తెలిసిందే. ఈ నిఘా నేత్రాలు మనల్ని అనుక్షణం మనల్ని పరిశీలిస్తూనే ఉంటాయి.
ఆఫీసులో కూర్చొని పోలీసులు మన ప్రతి కదలికనూ గమనిస్తున్నారు. మాస్క్ లేకుండా కనిపిస్తే బండి నంబర్ ఆధారంగా ఫైన్ నేరుగా మన మొబైల్‌కి వచ్చి చేరుతుంది. కాగా.. మాస్క్ లేకుండా కనిపిస్తే తెలంగాణలో అయితే రూ.500 - 1000 ఫైన్ వేస్తుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో మరింత కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మాస్క్ లేకుండా కనిపిస్తే వెంటనే అదుపులోకి తీసుకుని నేరుగా క్వారంటైన్‌కు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout