వాళ్లిద్దరూ దేవుళ్లు అయితే నేను భక్తుడిని - డైరెక్టర్ పరుశురామ్

  • IndiaGlitz, [Monday,August 08 2016]

అల్లు శిరీష్, లావ‌ణ్య జంట‌గా ప‌రుశురామ్ తెర‌కెక్కించిన చిత్రం శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మించారు. ఇటీవ‌ల రిలీజైన శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చిత్రం విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ ప‌రుశురామ్ మాట్లాడుతూ....మా చిత్రానికి ఇండస్ట్రీ నుంచి, సినీ విమ‌ర్శ‌కుల నుంచి ముఖ్యంగా ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తుండ‌డం చాలా ఆనందంగా ఉంది. ఇంత రెస్పాన్స్ వ‌స్తుంద‌ని అస‌లు ఊహించ‌లేదు. మంచి కంటెంట్ తో సినిమా తీస్తే ఆద‌రిస్తామ‌ని ప్రేక్ష‌కులు మ‌రోసారి నిరూపించారు.
నేను డైలాగ్స్ బాగా రాస్తాన‌ని అంద‌రూ అంటున్నారు ఆనందంగా ఉంది అయితే...నేను డైలాగ్స్ బాగా రాసాడు అనిపించుకోవాలి అని డైలాగ్స్ రాయ‌ను. సంద‌ర్భానుసారంగా ఆ క్యారెక్ట‌ర్ ఏం మాట్లాడితే బాగుంటుందో అదే రాస్తాను అంతే. ఇంకో విష‌యం...పూరి జ‌గ‌న్నాథ్, త్రివిక్ర‌మ్ త‌ర్వాత డైలాగ్స్ రాయాలంటే ప‌రుశురామ్ అని సోష‌ల్ మీడియాలో అంటున్నార‌ని తెలిసింది. దీనికి నా స‌మాధానం ఏమిటంటే...పూరి గారు, త్రివిక్ర‌మ్ గారు దేవుళ్లు అయితే నేను భ‌క్తుడుని.
ఇక నా సినిమాని చిరంజీవి గారు మ‌రి కొంత మంది బొమ్మ‌రిల్లు సినిమాతో పోల్చారు. అంత గొప్ప సినిమాతో పోల్చ‌డం మాట‌ల్లో చెప్ప‌లేనంత సంతోషంగా ఉంది. ఈ సినిమాకి శిరీష్ ఎంతో హార్డ్ వ‌ర్క్ చేసాడు. ఎన్ని సార్లు చేయ‌మ‌న్నా చేస్తాను మీకు స‌రిగా రాలేదు అనిపిస్తే ఏం ఫ‌ర్లేదు చెప్పండి మీరే నా గురువు అంటూ ఎంతో ఫేష‌న్ తో వ‌ర్క్ చేసాడు. ఇక లావ‌ణ్య కూడా క్యారెక్టర్ కి త‌గ్గ‌ట్టు అద్భుతంగా న‌టించింది. ఈ చిత్రాన్ని ఆద‌రించి మ‌ళ్లీ మంచి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ చేయ‌డానికి కావాల్సినంత శ‌క్తిని ఇచ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. నా త‌దుప‌రి చిత్రాన్ని కూడా గీతా ఆర్ట్స్ సంస్థ‌లోనే చేయ‌నున్నాను అన్నారు.

More News

'పెళ్లిచూపులు' శాటిలైట్ హ‌క్కులు ఎంతంటే'

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రీతూవ‌ర్మ జంట‌గా తరుణ్‌భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ్‌కందుకూరి, యష్ రంగినేని నిర్మించిన చిత్రం పెళ్ళిచూపులు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సురేష్ బాబు విడుద‌ల చేసిన ఈ చిత్రం అన్నీ చోట్ల నుండి పాజిటివ్ టాక్‌ను రాబ‌ట్టుకుంది.

నెక్ట్స్ మూవీ టైటిల్ ఎనౌన్స్ చేసిన వెంక‌టేష్

వెంక‌టేష్ - న‌య‌న‌తార జంట‌గా న‌టించిన చిత్రం బాబు బంగారం. మారుతి తెర‌కెక్కించిన బాబు..బంగారం ఈనెల 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

డిసార్డ‌ర్ వ్య‌క్తిగా రాజ్‌త‌రుణ్‌...

వ‌రుస విజ‌యాల మీదున్న యంగ్ హీరో రాజ్ త‌రుణ్ సెల‌క్టెడ్ స‌బ్జెక్ట్స్ ఎంచుకుంటూ సాగిపొతున్నాడు. ప్ర‌స్తుతం వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, సంజ‌నా రెడ్డి చిత్రంలో ఓ చిత్రంలో న‌టిస్తున్నాడు.

అడ‌వి శేష్ చిత్రంలో రీతూ

ఎవ‌డేసుబ్ర‌మ‌ణ్యంలో చిన్న‌పాత్ర‌లో క‌న‌ప‌డిన రీతూవ‌ర్మ త‌ర్వాత పెళ్ళిచూపులు చిత్రంలో హీరోయిన్‌గా న‌టించింది.చిత్ర‌గా ఈ చిత్రంలో స్వ‌తంత్ర్య భావాలు క‌లిగిన అమ్మాయిపాత్ర‌లోరీతూ న‌ట‌న అంద‌రి న‌ట‌న‌ను ఆక‌ట్టుకుంది.

స‌మంతకు త‌మ‌న్నా షాక్‌...?

100% ల‌వ్‌, త‌ఢాఖా చిత్రాలు త‌ర్వాత మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా మ‌రోసారి నాగ‌చైత‌న్య‌తో క‌లిసి న‌టించ‌నుంది. నాగ‌చైత‌న్య‌, క‌ల్యాణ్ కృష్ణ కాంబినేష‌న్‌లో ఓ సినిమా ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే.