అనురాగ్ కశ్యప్ రియాలిటీని ఆర్జీవీ ఊహిస్తే ఇలా ఉంటుందా!
Send us your feedback to audioarticles@vaarta.com
ఊహాలకే రెక్కలు వస్తే.. ఎలా ఉంటుంది? చాలా అద్భుతంగా ఉంటుంది కదా.. రియల్ లైఫ్‌లో డ్యూయెట్లు లేకుండా.. స్టెప్పులు లేకుండా... అసలు పాటలే లేకుండా.. ఓ సినిమాను తీస్తే మనం అంటే ముఖ్యంగా మన తెలుగు ప్రేక్షక లోకం అంగీకరించగలదా? కొంచెం కష్టమే కదా.. కానీ అదే సినిమా.. మరో భాషలో వస్తే.. డౌట్ లేకుండా తెగ మెచ్చేసుకుంటాం. ‘మనవాళ్ళిలా నాచురల్ గా తీయలేరండీ’ అని ఓ నిట్టూర్పు వదిలి.. కాసేపు గింజేసుకుని.. తిట్టుకుని ఊరుకుంటాం. తియ్యడానికి ప్రయత్నిస్తే చాలు అభిమానంతో అడ్డం పడిపోతాం. పైగా.. ‘ఇలాంటి సాహసాలు చెయ్యం మహాప్రభో’ అని దర్శకుడు లెంపలేసుకునేంత వరకూ నిద్రపోం. అందుకే మనవాళ్ళకంత శ్రమ లేకుండా హిందీలో ‘AK Vs AK ’ అని తీశారు.
‘AK Vs AK ’ అంటే అనిల్ కపూర్ వర్సెస్ అనురాగ్ కశ్యప్. ఇందులో అనురాగ్ కశ్యప్ బిహేవియర్ చూస్తూ ఉంటే మనకి మన రామ్ గోపాల్ వర్మే గుర్తొస్తూ ఉంటాడు. ఈ సినిమాలో పాత్రలు చాలా వరకు నిజమైనవే - అనిల్ కపూర్, బోనీ కపూర్ , సోనమ్ కపూర్ లాంటివి. వాడిన సినిమాల పేర్లు అన్నీ కూడా నిజమైనవే. ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటారా? సినిమా తీస్తే తెలుగు ప్రేక్షకులు హర్షించరు కానీ.. ఊహలకు దృశ్యరూపం ఇస్తే ఎలా స్పందిస్తారు అనే దానిపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ప్రయోగం చేశారు. ఈ కథను తన హీరో నాగార్జున, మెగాస్టార్‌లకు అన్వయించి చెప్పి వారిద్దరి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
‘‘అన్నట్టు ... ఈ కథని మన హీరోలకు అన్వయించి చెపుతూ ఫొటోలు కూడా పెట్టడంలో కేవలం పాఠకుల్ని అలరిద్దామనే . అంతే గానీ సదరు సినిమా వారికి సంబంధించిన వారిని అల్లరి పెట్టడానికో , ఆ యా సినీ ప్రముఖులను కించపరచడానికో ఎంతమాత్రమూ కాదు. అలా ఎవరికి అనిపించినా నవ్వుకొని వదిలెయ్యండి’’ అంటూ వర్మ ఒక నోట్ కూడా పెట్టారు. అయితే వర్మ ఊహ మాత్రం అదిరిపోయింది. నాగ్ కోడలు సమంతను తాను కిడ్నాప్ చేశానని.. విడిపించుకోమని చెప్పి ఓ టాస్క్ ఇవ్వడం.. దానికి ముందు ఒక స్టోరీని చాలా డ్రమెటికల్‌గా వివరించడం చాలా ఆకట్టుకుంటున్నాయి. వర్మ ఊహ ఎలా ఉందో.. నిజంగా అది ఆకట్టుకుంటుందో లేదో తెలియాలంటే దీనిని చదవాల్సిందే..
‘‘ఓ మాంఛి థ్రిల్లర్ కథ ’శివ’ తర్వాత మంచి హిట్ నాగార్జునకి ఇవ్వలేకపోయానని, ఈసారి అదిరిపోయే హిట్ ఇస్తానని నాగార్జునకి ప్రామిస్ చేసిన రామ్ గోపాల్ వర్మ ఆయనతో తీసిన ’ఆఫీసర్’ ఫెయిలయి కూచుంది. ఆ తరువాత ఓ మాంఛి థ్రిల్లర్ కథ ’శివ’ తర్వాత మంచి హిట్ నాగార్జునకి ఇవ్వలేకపోయానని, ఈసారి అదిరిపోయే హిట్ ఇస్తానని నాగార్జునకి ప్రామిస్ చేసిన రామ్ గోపాల్ వర్మ ఆయనతో తీసిన ’ఆఫీసర్’ ఫెయిలయి కూచుంది. ఆ తర్వాత ఓ ప్రోగ్రామ్ లో ఇద్దరూ కలవడం జరిగింది. మాటా మాటా అనుకున్నారు. "నీలో సరుకు అయిపోయింది. అందుకే ఇష్టమొచ్చినట్టు సినిమాలు తీస్తున్నావ్ " అని నాగార్జున, " మీరింకా హీరోనే అనుకుంటున్నారు. అంకుల్ ఎప్పుడో అయిపోయారు " అని రామ్ గోపాల్ వర్మ - ఒకర్నొకరు అవమానించుకున్నారు. అది జరిగిన కొద్ది రోజులకి డిసెంబర్ 31st న ఓ సినిమాలో నటిస్తున్న నాగార్జున ని రామ్ గోపాల్ వర్మ సెట్ లో కలుస్తాడు. తన సినిమాలో యాక్ట్ చెయ్యమని అడుగుతాడు. "నేనింకా నీ సినిమాలో యాక్ట్ చేస్తానని ఎలా అనుకున్నావ్ .... నీకేమైనా పిచ్చెక్కిందా" అని తిడతాడు నాగార్జున . " లేదు ... మీరు యాక్ట్ చేస్తున్నారు, యాక్ట్ చేస్తున్నారంతే ...బిగ్ బాస్ లాంటి రియాల్టీ షో లో హోస్ట్ గా వ్యవహరించడం కాదు. నేను తీస్తున్న ఈ రియల్ మూవీ లో మీరు ఇప్పటికీ హీరోయేనని నిరూపించుకోండి చూద్దాం.
నేను మీ కోడలు సమంతని కిడ్నాప్ చేశాను. రేపుదయం మీ ఇంట్లో అందరూ కలుసుకుని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకునే లోగా ఆమె ఎక్కడుందో కనుక్కుని విడిపించుకోండి. నేను ఈ కెమెరాతో ఫాలో అయి షూట్ చేస్తూ వుంటాను. మీకు దమ్ముంటే చైతన్య కి, పోలీసులకి, అసలు ఎవ్వరికీ చెప్పకుండా మీరొక్కరే కనుక్కుని విడిపించుకోండి. సూర్యోదయం అవడానికి ఇంకా పది గంటలే వుంది. అంటే మీకున్న టైమ్ కూడా కేవలం పది గంటలే" అని కాళ్ళూ చేతులు నోరూ కట్టేయగా విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్న సమంత వీడియోని చూపిస్తాడు. నాగార్జున నివ్వెరపోతాడు. వెంటనే సింగిల్‌గా నాగ్ రంగం లోకి దిగుతారు. ఉన్న ఏ ఆధారాన్నీ వదలకుండా ఛేదించుకుంటూ పరుగులు పెడతారు. మధ్యలో ఓ కారు డాష్ ఇస్తుంది. రోడ్డు మీద పడిపోతారు. రక్తం కారుతూ వుంటుంది. బట్టలు మట్టికొట్టుకు పోతాయి. ఒళ్ళు హూనం అయిపోతూ వుంటుంది. ’ఎలాంటి లైఫ్ నాది. ఇలా రోడ్డు మీద దిక్కు తోచకుండా ఈ దిక్కుమాలిన పరిస్థితి ఏంటి ?’ అనుకుంటూ ఒకానొక టైమ్‌లో కన్నీరు కూడా పెట్టుకుంటాడు. ’షాట్ బాగా వచ్చింది’ అని తృప్తి పడుతూ ఉంటాడు రామ్ గోపాల్ వర్మ. తగిన సాక్ష్యాన్ని పట్టుకోవడానికి కారుతున్న రక్తంతో.. మట్టికొట్టుకుపోయిన బట్టలతో - నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకుంటున్న- జనం మధ్యకి నాగ్ వెళతారు. వాళ్ళు మెచ్చిన తన హిట్ సాంగ్స్ కి డ్యాన్స్ కూడా చేస్తారు. జనం మధ్య దాక్కున్న సాక్ష్యాన్ని బైటికి రప్పించడానికి ఒక హీరో గా ఎంత చెయ్యాలో అంతా చేస్తారు.
ఇదే స్టోరీని చిరంజీవి కి అన్వయించుకుంటే - అక్కడ సమంతకి బదులు ఇక్కడ నాగబాబు గారి కూతురు నిహారిక వస్తుంది. చిరంజీవికి ఇదొక చాలెంజ్ . అసలే మొన్ననే పెళ్ళయిన అమ్మాయి. ఆమె అత్తవారికి తెలిస్తే బావుండదు. నాగబాబుకి తెలిస్తే తట్టుకోలేడు. ఇక పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధర్మ్ తేజ్ వీళ్ళలో ఎవరికి తెలిసినా ప్రళయమే. తనొక్కడే నిహారికని విడిపించి తీసుకు రావాలి. క్లైమాక్స్ ఏమిటన్నది ఓ పక్కన వుంచి ఆలోచిస్తే - అసలు ఈ స్టోరీని మన హీరోలతో మనం అంగీకరిస్తామా? హీరోయిన్ లేదు. డ్యూయెట్లు లేవు.. స్టెప్పులు లేవు. అసలు పాటలే లేవు. మరేం చేస్తాం? మరో భాషలో వస్తే తెగ మెచ్చేసుకుంటాం. ‘మనవాళ్ళిలా నాచురల్ గా తీయలేరండీ’ అని ఊ..ఊ..ఊ .. గింజేసుకుంటూ తిట్టేస్తూ ఉంటాం. తియ్యడానికి ప్రయత్నిస్తే చాలు అభిమానంతో అడ్డం పడిపోతాం. ‘ఇలాంటి సాహసాలు చెయ్యం మహాప్రభో’ అంటూ లెంపలేసుకునేంత వరకూ నిద్రపోం.
అందుకే మనవాళ్ళకంత శ్రమ లేకుండా హిందీలో ‘AK Vs AK ’ అని తీశారు. అంటే అనిల్ కపూర్ వర్సెస్ అనురాగ్ కశ్యప్. ఇందులో అనురాగ్ కశ్యప్ బిహేవియర్ చూస్తూ ఉంటే మనకి మన రామ్ గోపాల్ వర్మే గుర్తొస్తూ ఉంటాడు. ఈ సినిమాలో పాత్రలు చాలా వరకు నిజమైనవే - అనిల్ కపూర్, బోనీ కపూర్ , సోనమ్ కపూర్ లాంటివి. వాడిన సినిమాల పేర్లు అన్నీ కూడా నిజమైనవే. Netflix లో ఉన్న ఈ సినిమాని తెలుగులో కన్వర్ట్ చేసుకుని చూసే సౌకర్యం కూడా ఉంది. ఇంకేం ... డిసెంబర్ 31st న తాగి ఒళ్ళు గుల్ల చేసుకోకుండా , బైటికెళ్ళి పోలీసులతో తన్నులు తిని, ఫైన్‌లు కట్టి, జైలు శిక్ష అనుభవించకుండా - ఇంటి పట్టునే ఉండి, ఇంటి భోజనం చేసి రాత్రి పది గంటలకి ఈ సినిమా పెట్టుకుంటే పూర్తయిన పావు గంటకల్లా కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పుకుంటూ హాయిగా పడుకోవచ్చు. సో .... హ్యాపీ న్యూ ఇయర్ ...(అన్నట్టు ... ఈ కథని మన హీరోలకు అన్వయించి చెపుతూ ఫొటోలు కూడా పెట్టడంలో కేవలం పాఠకుల్ని అలరిద్దామనే . అంతే గానీ సదరు సినిమా వారికి సంబంధించిన వారిని అల్లరి పెట్టడానికో , ఆ యా సినీ ప్రముఖులను కించపరచడానికో ఎంతమాత్రమూ కాదు. అలా ఎవరికి అనిపించినా నవ్వుకొని వదిలెయ్యండి)
’’ అని వర్మ పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments