రాజేంద్ర ప్రసాద్, జయప్రద ప్రేమలో పడితే...!
Send us your feedback to audioarticles@vaarta.com
రాజేంద్రప్రసాద్, జయప్రద.. ఈ సీనియర్ స్టార్స్ ప్రేమలోపడటమేంటని అనుకుంటున్నారా? లేటు వయసులోఘాటు లవ్ ఏంటని భావిస్తున్నారా? రియల్ లైఫ్‌లో కాదులెండి.. రీల్ లైఫ్‌లోనే. నటకిరిటీ రాజేంద్రప్రసాద్, జయప్రద కాంబినేషన్లో ‘లవ్ @60’ అనే మూవీ రూపొందనుంది. అయితే ఈ మూవీ థియేటర్స్‌లో విడుదల కాదట. కేవలం డిజిటల్ స్ట్రీమింగ్ కోసమే ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ఈ వెబ్ మూవీని తెరకెక్కిస్తున్నారట. 60 సంవత్సరాల వయసులో ఓ జంట ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? వారి కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకుంటాయి. వారు ఎదుర్కొన్న అనుభవాలేంటి? అనే కోణంలో ఈ వెబ్ మూవీ ఉంటుందని అంటున్నారు. ఓ ప్రముఖ డిజిటల్ మాధ్యమం రూపొందిస్తోన్న ‘లవ్ @60’కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
లాక్డౌన్ సమయంలో థియేటర్స్ మూత పడటంతో దర్శక నిర్మాతలకు ఓటీటీలే మార్గమయ్యాయి. కొత్త కొత్త కాన్సెప్టులతో సినిమాలు రూపొందిస్తున్నారు. థియేటర్స్ కోసం ఎదురుచూసే అవకాశం లేకుండా పరిమిత బడ్జెట్లో సినిమాలను చేసి ఓటీటీల్లో విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే వి.ఎన్.ఆదిత్య ‘లవ్ @60’ సినిమాను తెరెక్కిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments