Rajagopal Reddy: కాంగ్రెస్‌లోకి రాజగోపాల్ రెడ్డి వెళ్తే ఆయనపై పోటీకి బీజేపీ మాస్టర్ ప్లాన్..?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అందుకు తగ్గ ప్రణాళికలతో ముందుకెళ్తుంది. తమ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లిన నేతలకు గాలం వేస్తోంది. ఈ క్రమంలోనే మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో రాజగోపాల్ రెడ్డి పేరును ప్రకటించలేదు. ఆయన కాంగ్రెస్‌లో చేరితే బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని కమలం నేతలు ఆలోచిస్తున్నారట. బీసీ సామాజిక వర్గానికి చెందిన బూర నర్సయ్య గౌడ్‌ను రాజగోపాల్ రెడ్డిపై పోటీ చేయించాలని యోచిస్తున్నారని తెలుస్తోంది.
2014లో ఎంపీగా గెలిచిన బూర నర్సయ్య గౌడ్..
ఈసారి టిక్కెట్ల కేటాయింపులో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే మునుగోడులోనూ బీసీలకు సీటు ఇవ్వాలని భావిస్తుందట. ముఖ్యంగా మునుగోడులో గౌడ ఓటర్లు 35వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. వీరితో పాటు ముదిరాజ్, పద్మశాలి, యాదవ, ఎరుకల, కుమ్మరి, విశ్వబ్రాహ్మణ ఓటర్లు కూడా భారీగానే ఉన్నారు. దీంతో మునుగోడు నుంచి బూర నర్సయ్యకు అవకాశం ఇస్తే బీసీ కార్డు కలిసి వస్తుందని ప్లాన్ చేస్తున్నారట. 2014 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి స్థానం నుంచి పోటీ చేసిన బూర నర్సయ్య గౌడ్.. రాజగోపాల్ రెడ్డిని ఓడించిన సంగతి తెలిసిందే. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే మ్యాజిక్ రిపీట్ చేయాలని కమలం పెద్దలు డిసైడ్ అయ్యారట.
రాజగోపాల్ రెడ్డితో కలిసి సొంత గూటికి వివేక్..?
ఇదిలా ఉంటే రాజగోపాల్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ వివేక్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి, వివేక్‌తో పాటు మరో కీలక మహిళా నేతను కూడా కాంగ్రెస్‌లోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట. బీజేపీలోనే ఉండాలా? కాంగ్రెస్‌లో చేరాలా? అనే అంశంపై తీవ్రంగా చర్చిస్తున్నారట. మరో రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముందని సన్నిహితులు చెబుతున్నారు. పార్టీలో చేరితే సముచిత స్థానం కల్పిస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. మరి తిరిగి సొంత గూటికి వెళ్తారా..? లేక బీజేపీలోనే ఉంటారా..? తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments