Rajagopal Reddy: కాంగ్రెస్‌లోకి రాజగోపాల్ రెడ్డి వెళ్తే ఆయనపై పోటీకి బీజేపీ మాస్టర్ ప్లాన్..?

  • IndiaGlitz, [Tuesday,October 24 2023]

తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అందుకు తగ్గ ప్రణాళికలతో ముందుకెళ్తుంది. తమ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లిన నేతలకు గాలం వేస్తోంది. ఈ క్రమంలోనే మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో రాజగోపాల్ రెడ్డి పేరును ప్రకటించలేదు. ఆయన కాంగ్రెస్‌లో చేరితే బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని కమలం నేతలు ఆలోచిస్తున్నారట. బీసీ సామాజిక వర్గానికి చెందిన బూర నర్సయ్య గౌడ్‌ను రాజగోపాల్ రెడ్డిపై పోటీ చేయించాలని యోచిస్తున్నారని తెలుస్తోంది.

2014లో ఎంపీగా గెలిచిన బూర నర్సయ్య గౌడ్..

ఈసారి టిక్కెట్ల కేటాయింపులో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే మునుగోడులోనూ బీసీలకు సీటు ఇవ్వాలని భావిస్తుందట. ముఖ్యంగా మునుగోడులో గౌడ ఓటర్లు 35వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. వీరితో పాటు ముదిరాజ్, పద్మశాలి, యాదవ, ఎరుకల, కుమ్మరి, విశ్వబ్రాహ్మణ ఓటర్లు కూడా భారీగానే ఉన్నారు. దీంతో మునుగోడు నుంచి బూర నర్సయ్యకు అవకాశం ఇస్తే బీసీ కార్డు కలిసి వస్తుందని ప్లాన్ చేస్తున్నారట. 2014 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి స్థానం నుంచి పోటీ చేసిన బూర నర్సయ్య గౌడ్.. రాజగోపాల్ రెడ్డిని ఓడించిన సంగతి తెలిసిందే. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే మ్యాజిక్ రిపీట్ చేయాలని కమలం పెద్దలు డిసైడ్ అయ్యారట.

రాజగోపాల్ రెడ్డితో కలిసి సొంత గూటికి వివేక్..?

ఇదిలా ఉంటే రాజగోపాల్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ వివేక్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి, వివేక్‌తో పాటు మరో కీలక మహిళా నేతను కూడా కాంగ్రెస్‌లోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట. బీజేపీలోనే ఉండాలా? కాంగ్రెస్‌లో చేరాలా? అనే అంశంపై తీవ్రంగా చర్చిస్తున్నారట. మరో రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముందని సన్నిహితులు చెబుతున్నారు. పార్టీలో చేరితే సముచిత స్థానం కల్పిస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. మరి తిరిగి సొంత గూటికి వెళ్తారా..? లేక బీజేపీలోనే ఉంటారా..? తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

More News

KCR: సీఎం కేసీఆర్ నియోజకవర్గాల ప్రచార షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

ఎన్నికల వేళ సుడిగాలి పర్యటనలు చేస్తున్న సీఎం కేసీఆర్ నియోజకవర్గాల పర్యటనల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. అక్టోబర్ 26న అచ్చంపేట,

Pawan Kalyan: ఈనెల 27న అమిత్‌ షాతో పవన్ కల్యాణ్‌ భేటీ.. సీట్ల సర్దుబాటుపై చర్చ..

ఎన్నికల సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఎత్తులు పైఎత్తులతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

Medigadda Barrage: మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్‌ని పరిశీలించిన కేంద్ర బృందం

కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్‌ని కేంద్ర బృందం పరిశీలించింది. వంతెన కుంగిన ఘటనపై ఆరుగురు నిపుణులతో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.

Srilanka: శ్రీలంక వెళ్లాలనుకునే భారతీయులకు గుడ్ న్యూస్.. ఇక ఆ అవసరం లేదు..

శ్రీలంక ప్రభుత్వం భారతీయులకు శుభవార్త అందించింది. ఇక నుంచి వీసా అవసరం లేకుండానే తమ దేశం రావొచ్చని ప్రకటించింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana TDP: తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీపై కాసాని జ్ఞానేశ్వర్ క్లారిటీ

తెలంగాణ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉందనే ప్రచారంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే కుట్ర ప్రకారం విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.