RRR రేంజ్ ప్రమోషన్ Pushpa కి చేసి ఉంటె !!
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమా తీసాక దానిపై జనానికి ఆసక్తి ఎలా తీసుకురావాలో తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళికి బాగా తెలుసు. పాన్ ఇండియా సినిమా తీసాం అంటే తీసాం అన్నట్టు కాకుండా దాన్ని ప్రమోట్ చెయ్యడం ముఖ్యం.. ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీలో డజన్ల కొద్దీ అగ్ర నటులు ఉన్నారు, వాళ్ళ సినిమాలు వదిలేసి మన తెలుగు సినిమా చూడాలి అంటే కథ తో పాటు సినిమా ప్రమోషన్ కూడా చెయ్యాలి.
పుష్ప విషయానికి వస్తే కేవలం కథలో ఉన్న బలం వల్ల నడిచిన సినిమా తప్ప ప్రమోషన్ లు చాలా తక్కువ.. ఒకానొక ప్రెస్ మీట్ లో డైరెక్టర్ సుకుమార్ అయితే ఇది అసలు కొన్ని బాషల్లో రిలీజ్ అవుతుంది అనే నమ్మకమే లేదు అన్నారు. అయినప్పటికీ అన్ని బాషల్లో హిట్ టాక్ తో వరల్డ్ వైడ్ 365 కోట్ల గ్రాస్ వసూలు చెసింది..
ఇప్పుడు పుష్ప 2 కి బ్లాక్ బస్టర్ సీక్వెల్ సెంటిమెంట్ ఎలాగూ ఉంది దానికి తగ్గట్టు ప్రమోషన్లు చేస్తే ఇండియన్ బాక్స్ ఆఫీస్ మరో సారి బద్దలవ్వడం ఖాయం.. టాలీవుడ్ పేరు మరొక్కసారి మారుమోగడం తధ్యం..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout