ప్రభాస్ రాకపోతే టవర్‌పై నుంచి దూకేస్తా: వీరాభిమాని
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోలు అంటే అభిమానులకు ఎంత పిచ్చి ఉంటుందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. సినిమా రిలీజ్లు, ఈవెంట్స్, అభిమాన హీరో వాళ్ల ఊరొచ్చినప్పుడు ‘అభిమానం’ అంటే ఎలా ఉంటుందో చూపిస్తుంటారు. అంతేకాదు.. హీరోలను గుండెల్లో పెట్టుకోవడమే కాదు ఏకంగా గుడి కట్టేసిన సందర్భాలు కోకొల్లలు.
ఇక అసలు విషయానికొస్తే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు అభిమానులు ఏ రేంజ్లో ఉన్నారో అందరికీ తెలిసిందే. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా డార్లింగ్‌కు అభిమానులున్నారు. ప్రభాస్‌ను అభిమానులు ఎలా అభిమానిస్తారో.. ఫ్యాన్స్‌ను కూడా అంతే రీతిలో ఆయన.. డార్లింగ్.. డార్లింగ్ అంటూ చూసుకుంటారు. అయితే తాజాగా.. జనగాం జిల్లాలో ఓ యువకుడు టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. ప్రభాస్ ఇక్కడికి రాకపోతే టవర్ పై నుంచి దూకి చచ్చిపోతానని బెదిరింపులకు దిగాడు.
ఇంతకీ ఎవరీ యువకుడు.. ఏమంటున్నాడు!
‘హీరో ప్రభాస్ అంటే నాకు అభిమానం.. ఆయనకు నేను వీరాభిమానిని. వెంటనే ప్రభాస్‌ను చూడాలని ఉంది.. ఇక్కడికి తీసుకురండి. ప్రభాస్ రాకుంటే టవర్ పై నుంచి దూకేస్తాను.. ప్రభాస్ ఇక్కడికొచ్చి నాతో మాట్లాడాలి.. అతనితో నేనూ మాట్లాడాలి.. లేకుంటే దూకేస్తాను’ అని ఆ యువకుడు బెదిరింపులకు పాల్పడుతున్నాడు.
ఇదిలా ఉంటే.. ఈ ఘటన జనగాం జిల్లాలోని యశ్వంత్‌పూర్‌లో చోటుచేసుకుంది. పెట్రోల్ బంక్ పక్కన రిలయన్స్ టవర్ ఎక్కి యువకుడు హల్ చల్ చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు యువకుడి గురించి ఆరా తీయగా.. మహబూబాబాద్‌కు చెందిన గుగులోత్ వెంకన్నగా గుర్తించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments