'సిద్ధ' పాత్ర చరణ్‌కు బదులు పవన్ చేసుంటే.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన మెగాస్టార్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘ఆచార్య’’ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకురానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించిన ఆచార్య టీమ్ ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్‌లపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా మంగళవారం చిరు, చరణ్, కొరటాల శివ మీడియాతో ముచ్చటించారు . ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఒకవేళ ఆచార్య సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ చేసి ఉంటే? ఎలా వుండేదని మీడియా ప్రశ్న సంధించింది.
దీనికి మెగాస్టార్ బదులిస్తూ.. ‘‘సిద్ధ’’ క్యారెక్టర్‌కు ఏ హీరో అయినా న్యాయం చేస్తాడని అన్నారు. కానీ, రామ్ చరణ్ చేస్తే ఆ ఫీల్ వేరుగా వుంటుందని... నిజ జీవితంలో తండ్రీ కొడుకుల అనుబంధం వెండి తెరపై పాత్రలకు అదనపు బలంగా మారుతుందని చిరు అభిప్రాయపడ్డారు. ఒకవేళ చరణ్‌కు ఈ పాత్ర చేయడం కుదరకపోపతే దానికి బెస్ట్ ఆల్టర్నేటివ్ పవన్ కళ్యాణ్'' అని మెగాస్టార్ తేల్చిచెప్పారు. చరణ్ బదులు పవన్ ఉన్నా తనకు సేమ్ ఫీలింగ్ వచ్చేదని చిరంజీవి తెలిపారు. అయితే, అంత వరకూ రాలేదని ఆచార్యకు అన్ని బాగా కుదిరాయి అని చిరంజీవి తెలిపారు.
మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మించిన ఆచార్యలో కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రామ్‌చరణ్, పూజాహెగ్డే, సోనూసూద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఆచార్య నుంచి విడుదలైన 'లాహె లాహె', 'నీలాంబరీ' ‘శానా కష్టం’ పాటలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఇక చిరంజీవి వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన రాజా దర్శకత్వంలో గాడ్‌ఫాదర్‌తో పాటు మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్, బాబీ డైరెక్షన్‌లో ‘‘వాల్తేర్ వీరయ్య’’, వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు మెగాస్టార్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout