పులివెందుల‌లో సొంత చిన్నాన్న‌ను చంపితేనే..!

  • IndiaGlitz, [Monday,March 25 2019]

తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ప‌ట్టించుకోలేదు. అధికార పార్టీ నాయ‌కుల‌ను చ‌ట్ట‌స‌భ‌ల్లో నిల‌దీయాల్సిన‌ ప్ర‌తిప‌క్ష‌నేత అసెంబ్లీకి వెళ్లరు. ఎంత‌సేపు పాద‌యాత్ర‌లు, ఊరేగింపులు, బొట్లు పెట్టించుకోవ‌డంలో బిజీగా ఉంటూ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను గాలికొదిలేశారు. ముఖ్య‌మంత్రి అయితే స‌మ‌స్య తీరుస్తామంటే.. మీరు ముఖ్య‌మంత్రి అయ్యేదెప్పుడు, స‌మ‌స్య తీరేదెప్పుడు? కంచుకోట‌లాంటి పులివెందుల‌లోనే సొంత చిన్నాన్న‌ను న‌రికి చంపితేనే హ‌త్య ఎవ‌రు చేశారో ఇప్ప‌టి వ‌ర‌కు మీకు తెలియ‌దు.

సొంత ఇంట్లో భ‌ద్ర‌త‌కల్పించలేని మీరు, ముఖ్య‌మంత్రి అయి రేపు రాష్ట్రంలో శాంతిభ‌ద్రతలు ఏం కాపాడ‌తారు..? నేర‌చ‌రిత్ర క‌లిగిన‌వారురాజ‌కీయాల్లోకి వ‌చ్చి మా జీవితాల‌తో ఆడుకోవాల‌ని చూస్తే కాళ్లు విర‌గొట్టి మూల కూర్చొబెడ‌తాం. 2014లో మ‌న బిడ్డ‌ల భ‌విష్య‌త్తు కోసం అనుభ‌వం ఉన్న నాయ‌కుడు కావాల‌ని ఏం ఆశించ‌కుండా తెలుగుదేశం పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చాను.

చంద్ర‌బాబుగారు అవినీతిర‌హిత పాల‌న అందిస్తార‌ని ఆశించాను. కానీ రాష్ట్రంలో ఏ మూల‌కు వెళ్లినా బాధ్య‌తారాహిత్యం క‌నిపించింది. ఇసుక మాఫియా, మ‌ట్టి మాఫియాతో కోట్లు కూడ‌బెట్టారు. చంద్ర‌బాబుకి ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అంటే భ‌యం. తెలుగుదేశం పార్టీకి ద‌మ్ము, ధైర్యం, తెగింపు లేదు. రాష్ట్రంలో ద‌మ్ము, ధైర్యం,తెగింపు ఉన్న ఏకైక పార్టీ జ‌న‌సేన పార్టీ. తెలుగు త‌మ్ముళ్లు గుర్తుపెట్టుకోండి దెబ్బ‌తిన‌డానికి ఇది 2009 కాదు 2019.. దెబ్బ‌కు దెబ్బ‌తీస్తాం అని పవన్ కల్యాణ్ సభా వేదికగా తెలిపారు.

More News

న‌య‌న‌తార‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన రాధార‌వి..

సీనియ‌ర్ న‌టుడు రాధార‌వి హీరోయిన్ న‌య‌న‌తార‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. న‌య‌న‌తార ప్ర‌ధాన పాత్ర‌ల న‌టించిన `కొల‌యుత్తిర్ కాలం` సినిమా ప్రెస్‌మీట్‌లో

నన్ను చంపగలవేమో.. రెచ్చగొడితే బాగోతం బయటపెడతా!

సీనియర్ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్ బాబు గత కొన్ని రోజులుగా తన కాలేజీకి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఏపీ సర్కార్‌తో పోరాటం చేస్తున్న సంగతి

డిపాజిట్లు రావని పవన్‌కు భయం: వైఎస్ జగన్

నేరుగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే డిపాజిట్లు రావని జనసేన అధినేత పవన్‌‌కు భయమని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

బద్ధ శత్రువులు కలిశారు.. ఖమ్మం ఎంపీ సీటు గెలుస్తారా!?

ఖమ్మం జిల్లాకు చెందిన రాజకీయ ఉద్ధండులు నామా నాగేశ్వరవు- తుమ్మల నాగేశ్వరరావు మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేంతగా పరిస్థితులున్న విషయం తెలిసిందే.

తెలంగాణకు అడ్డుపడ్డ వైసీపీకి కేసీఆర్ మద్దతా?

తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు వేలు పెట్టడంతో.. గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్..