ఇది నా లవ్ స్టోరీ కి యు/ఎ సర్టిఫికెట్
Send us your feedback to audioarticles@vaarta.com
లవర్ బాయ్ తరుణ్ హీరోగా నటించిన లెటెస్ట్ మూవీ "ఇది నా లవ్ స్టోరీ". కొలీవుడ్ క్రేజీ హీరొయిన్ ఓవియా తొలిసారి టాలీవుడ్ లొ కధానాయికగా ఈ చిత్రంతో పరిచయమవుతొంది. రమేష్ గోపి దర్శకులు. అభిరామ్ సమర్పణలో రామ్ ఎంటర్ టైనర్స్ పతాకంపై ఎస్.వి.ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రేమికుల దినొత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్ ,సాంగ్ టీజర్ లతో సోషల్ మీడియా ట్రెండింగ్ లొ "ఇది నా లవ్ స్టోరీ" నిలిచింది. ఇటీవలె సెన్సార్ పూర్తి చెసుకొన్న ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ లభించింది. చాలా రోజుల తర్వాత పూర్తి లవ్ ఫీల్ ని కలిగించె చిత్రంగా ఇది నా లవ్ స్టోరీ ఉందని సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్ ను అభినందించారు.
ఈ సందర్బంగా తరుణ్ మాట్లాడుతూ.. ఓ మంచి ఫీల్ గుడ్ ఫిలింను ఇది నా లవ్ స్టొరీ రూపంలొ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాము. ప్రేమికుల దినొత్సవం సందర్బంగా సినిమాను విడుదల చెస్తున్నామన్నారు.
దర్శకులు రమేష్ గోపి మాట్లాడుతూ. తెలుగు ప్రేక్షకుల అభిరుచుకి తగ్గట్టుగా తెరకెక్కించాము. సెన్సార్ సభ్యులు అభినందనలు ఆనందాన్ని కలిగించాయి. కుటుంబమంతా కలిసి చూడదగ్గ క్లీన్ లవ్ స్టొరీగా మా చిత్రముంటుందన్నారు.
నిర్మాత ఎస్.వి.ప్రకాష్ మాట్లాడుతూ.. 2018 ది బెస్ట్ మూవీస్ లొ ఇది నా లవ్ స్టొరీ ఒకటిగా నిలుస్తుంది.ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్ కు సన్నాహాలు చెస్తున్నామన్నారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com