లడక్ లో సాంగ్స్ పూర్తి చేసుకున్న 'ఇది నా లవ్ స్టోరీ'

  • IndiaGlitz, [Sunday,August 21 2016]

తరుణ్ ,ఓవియా జంటగా రామ్ ఎంటర్ టైనర్స్ బ్యా నర్ పై రమేష్ గోపి దర్శకత్వం లో అభిరామ్ సమర్పణలో ఎస్ .వి ప్రకాష్ నిర్మిస్తున్న చిత్రం "ఇది నా లవ్ స్టొరీ ". ఒక సాంగ్ మినహా చిత్రీకరణ పూర్తి చేసుకుంది .
ఈ చిత్ర విశేషాలను దర్శకుడు తెల్పుతూ ..... "లే లడక్ , కులుమనాలి లో చిత్రీకరించిన సాంగ్స్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి . మూడు పాత్రలలో తరుణ్ నటన అందరిని ఆకట్టుకుంటుంది .లవర్ బాయ్ గా తరుణ్ కి వున్న ఇమేజ్ ఏమాత్రం తగ్గకుండా పూర్తి స్థాయి లవ్ స్టొరీ ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందించాము .
ప్రముఖ సంగీత దర్శకుడు ఏ .ఆర్ రెహమాన్ శిష్యుడు శ్రీనాథ్ విజయ్ ని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం . నిర్మాత ఎస్ .వి ప్రకాష్ సహకారం తో ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని పూర్తి చేసాం . డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా చిత్రం ఆడియో ని వచ్చే నెలలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం . అని అన్నారు .

More News

మెగాస్టార్ 150వ చిత్రం పేరు 'ఖైదీ నెంబర్ 150'

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 150వ సినిమా శరవేగంగా తెరకెక్కుతోంది.వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

హీరో గోపీచంద్ చేతులమీదుగా 'మెంటల్' ఆడియో ఆవిష్కరణ

శ్రీకాంత్,అక్ష హీరోహీరోయిన్ లుగా రాజా ఆర్ట్ ప్రొడక్షన్స్ మరియు సుబ్రమణ్య ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లలో

గురువు గారి మాట పాటించాను...చుట్టాలబ్బాయితో సక్సెస్ సాధించాను - డైరెక్టర్ వీరభద్రమ్

అహనా పెళ్లంట,పూలరంగడు,భాయ్ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్ తెరకెక్కించిన తాజా చిత్రం చుట్టాలబ్బాయి.ఆది,నమితా ప్రమోద్ జంటగా నటించిన చుట్టాలబ్బాయి చిత్రం ఇటీవల రిలీజై విజయవంతంగా ప్రదర్శితమౌతుంది.

ఆగస్ట్ 27న మిస్టర్ 420 ఆడియో రిలీజ్, సెప్టెంబర్ 9న సినిమా విడుదల

యూత్ లో వరుణ్ సందేశ్ కు ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ప్రేమ కథా చిత్రాల్లో విభిన్నమైన కథలు ఎంచుకుంటూ ఎంటర్ టైన్ చేస్తున్న వరుణ్ సందేశ్ తన కెరీర్లోనే మరో విభిన్న ప్రేమ కథా చిత్రంలో నటిస్తున్నారు.

కొత్త నిర్మాత తో రవితేజ....

ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక సినిమా కూడా చేయని మాస్ మహారాజా రవితేజ కొత్త చిత్రం కోసం రెడీ అవుతున్నాడు.