పోస్ట్ ప్రొడక్షన్ లో 'ఇది నా లవ్ స్టోరీ'
Send us your feedback to audioarticles@vaarta.com
తరుణ్, ఓవియా జంటగా అభిరామ్ సమర్పణలో రామ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రమేష్, గోపి దర్శకత్వంలో ఎస్.వి.ప్రకాష్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ఇది నా లవ్ స్టోరీ. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా...
చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ `అవుటండ్ అవుట్ లవ్ స్టోరీ. ఒక అమ్మాయిని ఎంత ప్రేమించామనే కాన్సెప్ట్ తో సినిమా రూపొందింది. తరుణ్, ఓవియా సూపర్ పెర్ ఫార్మెన్స్ చేశారు. సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. తరుణ్, ఓవియాల ఇద్దరూ మూడు షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ని అద్భుతంగా చేశారు. రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ను పూర్తి చేశాం. ఇప్పుడు మూడో క్యారెక్టర్ ను కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో అద్భుతమైన లోకేషన్స్ లో చిత్రీకరించాం. జూన్ లో ఆడియో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: క్రిస్టోఫర్ జోసెఫ్, సంగీతం: శ్రీనాథ్ విజయ్, డైలాగ్స్: వీరబాబు బాసిన, ఆర్ట్: జె.కె.మూర్తి, ఎడిటర్: సింగంపల్లి శివశంకర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: వెంకటేష్.పి, జగదీష్, నిర్మాత: ఎస్.వి.ప్రకాష్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రమేష్, గోపి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments