షూటింగ్ పూర్తీ చేసుకున్న ఇదేం దెయ్యం

  • IndiaGlitz, [Saturday,June 24 2017]

శ్రీనాద్ మాగంటి, సాక్షి కక్కర్, రచ్చ రవి, కిరాక్ అర్పి , రచన స్మిత్ , రుచి ప్రధాన పాత్రలో .. ఎ వి రమణ మూర్తి సమర్పణలో వి రవివర్మ దర్శకత్వంలో చిన్మయానంద ఫిలిమ్స్ పతాకం పై ఎస్. సరిత నిర్మిస్తున్న చిత్రం ''ఇదేం దెయ్యం''. 'ముగ్గురు అమ్మాయిలతో' అనే కాప్షన్ తో తెరకెక్కుతున్న హర్రర్ కామెడీ చిత్రం షూటింగ్ పూర్తీ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.

ఈ సందర్బంగా చిత్ర వివరాలను నిర్మాత ఎస్ . సరిత తెలియచేస్తూ .. ఈ మద్య హర్రర్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది. ముక్యంగా ఈ తరహా చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్ తో హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ గా ఇదేం దెయ్యం చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ముగ్గురు అమ్మాయిలతో అన్నది ఉప శిర్షిక. ముగ్గురు యువకులు అనుకోకుండా వారికి ఆపద ఎదురైంది .. దాన్న్నుంచి ఎలా తప్పించుకున్నారు. వారు తప్పించుకునే ప్రయత్నంలో జరిగే సంగటనలు చాలా ఫన్ గా ఉంటాయి. పూర్తీ స్తాయి కామెడి నేపద్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం.. హర్రర్ సినిమా అయినా కూడా ఫ్యామిలీ అందరు చూసేలా ఉంటుంది. హీరో శ్రీనాద్, జబర్దస్ట్ కమెడియన్స్ రచ్చ రవి , కిరాక్ అర్పి ల కామెడి గిలిగింతలు పెడుతుంది. ఇందులో ఐదు పాటలు ఉంటాయి. బాలు అందించిన మ్యూజిక్, రి రికార్డింగ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అన్నారు.

ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతలో షూటింగ్ పూర్తీ చేసాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు జరపనున్నాం అని తెలిపారు. జీవ, అనంత్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం : బాలు స్వామి, కెమెరా : కృష్ణ ప్రసాద్, సహా నిర్మాతలు : రత్న శేఖర్, రామ్ కిషోర్, మధుసూదన్ , సౌజన్య , నిర్మాత : ఎస్ సరిత , దర్శకత్వం : వి . రవివర్మ .