'ఇద్దరి లోకం ఒకటే' ప్రీ రిలీజ్ ఈవెంట్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ హీరో రాజ్‌తరుణ్, షాలిని పాండే జంటగా రూపొందుతోన్నలవ్ ఎంటర్టైనర్ 'ఇద్దరి లోకం ఒకటే'. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మాతగా రూపొందుతున్న చిత్రం 'ఇద్దరి లోకం ఒకటే'. జీఆర్.క ష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా సినిమాను డిసెంబర్ 25న విడుదల చేస్తున్నారు. శనివారం ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ చైతన్య కాలేజ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ..
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - `"చైతన్య కాలేజ్‌లోనే కేరింత సినిమా ఫంక్షన్‌ను ప్లాన్ చేశాం. ఈ కాలేజ్ స్టూడెంట్స్‌కే తొలిసారి సినిమా వేశాం. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సోమవారం నెల్లూరు, మంగళవారం వైజాగ్, బుధవారం మెల్బోర్న్లో స్పెషల్ షోలు వేస్తున్నాం. రెండేళ్ల ప్రయాణమే ఈ సినిమా. డైరెక్టర్ కృష్ణ చెప్పిన ఐడియా నచ్చింది. ఇద్దరు ముగ్గురు హీరోలను అనుకున్నాం కానీ ఓకే కాలేదు. ఇక నావల్ల కాదని డైరెక్టర్‌కి చెప్పేశా. అయితే ఓ రోజు డైరెక్టర్ కృష్ణగారు నాకు ఫోన్ చేసి ఇలా రాజ్‌తరుణ్‌గారిని కలిసి కథ చెప్పాం. ఆయన చేస్తామని అన్నారని చెప్పాడు. తర్వాత రాజ్‌తరుణ్ వచ్చి నాతో మాట్లాడాడు. తర్వాత ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. మిక్కి జె.మేయర్, సమీర్ రెడ్డి సహా టాప్ టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమాకు పనిచేశారు. హీరోయిన్ విషయంలో ముగ్గురు, నలుగురిని అనుకున్నాం. కానీ శిరీష్ మాత్రం షాలిని పేరును సజెస్ట్ చేసి ఒప్పించాడు. షాలిని ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చిన తర్వాత లుక్ మరింత బెటర్ అయ్యింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. ఫస్టాఫ్ చూసిన తర్వాత నాకు ఎక్కలేదు. ఆ విషయాన్ని డైరెక్టర్‌కి చెప్పాను. మళ్లీ మార్పులు చేర్పులు చేసి సినిమాను చూపించారు. గత నెల ఫైనల్ ప్రొడక్ట్ చూసి డైరెక్టర్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చి బయటకు వచ్చేశాను. నేను ఏదైతే ఫీలయ్యానో నిన్న స్టూడెంట్స్ సినిమా చూసి అలాంటి రెస్పాన్స్‌ను ఇచ్చారు. డిమాంగ్ చేసినట్లు కాకుండా కథానుగుణంగా సినిమాను తెరకెక్కించారు. ఫస్టాఫ్ టైమ్‌పాస్‌లా ఉంటుంది. సెకండాఫ్ గుడ్..ముఖ్యంగా క్లైమాక్స్ వెరీగుడ్ అనిపిస్తుంది. జెన్యూన్ ఫిలిం. ఎఫ్2, మహర్షి తర్వాత ఈ సినిమాతో సక్సెస్ కొడితే హ్యాట్రిక్ వచ్చేసినట్టే" అన్నారు.
హీరో రాజ్‌తరుణ్ మాట్లాడుతూ - "ఇద్దరి లోకం ఒకటే` బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ. కచ్చితంగా సినిమా నచ్చుతుంది. అందరూ థియేటర్లోనే సినిమా చూడండి. పైరసీని ఎంకరేజ్ చేయొద్దు" అన్నారు.
డైరెక్టర్ జి.ఆర్.కృష్ణ మాట్లాడుతూ - "పుట్టుక నుండి చివరి వరకు ఇద్దరి వ్యక్తుల జర్నీ. డిసెంబర్ 25న విడుదలవుతుంది" అన్నారు.
ఈ కార్యక్రమంలో బెక్కం వేణుగోపాల్ సహా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout