Allu Arha : డబ్బింగ్ చెబుతోన్న అల్లు అర్హ.. మురిసిపోతున్న బన్నీ, ఫోటో వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి వేసిన విత్తనం నుంచి ఒక మహా వృక్షంలా మారింది మెగా ఫ్యామిలీ. ఆయన అడుగుజాడల్లో నాగబాబు, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, నిహారిక, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, సాయిథరమ్ తేజ్, కల్యాణ్ దేవ్ వంటి వారు హీరోలుగా నిలబడ్డారు. ఇండస్ట్రీలోని అగ్ర కథానాయకుల్లో సగ భాగం మెగా ఫ్యామిలీ నుంచే వున్నారు. తాజాగా ఆ కుటుంబం నుంచి తర్వాతి తరం కూడా స్క్రీన్‌పై ఎంట్రీ ఇవ్వనుంది.
తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటోన్న అల్లు అర్హ:
అల్లు అర్జున్ - స్నేహ దంపతుల పిల్లలు అల్లు అర్హ, అల్లు అయాన్‌కు కూడా సోషల్ మీడియాలో బోలెడు క్రేజ్ ఉంది. ముఖ్యంగా ‘శాకుంతలం’ సినిమాతో వెండితెరపైకి అడుగుపెడుతున్న అల్లు అర్హకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాల్లో చిన్నారి అర్హ.. భరతుడి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన శాకుంతలం ట్రైలర్లో సింహంపై స్వారీ చేస్తున్న భరతుడిగా అర్హ కనిపించి ఆకట్టుకుని తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంటోంది. అంతేకాదు.. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటూ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ తెగ ముచ్చటపడిపోతున్నారు. చిన్న వయసులోనే ఎంతో ప్రతిభ చూపుతోందని కామెంట్ చేస్తున్నారు.
ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు శాకుంతలం:
ఇదిలావుండగా.. అత్యంత భారీ బడ్జెట్‌తో గుణశేఖర్ శాకుంతలం సినిమాను నిర్మిస్తున్నారు. దిల్‌రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇందులో దుష్యంత మహారాజు పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. మోహన్ బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్, గౌతమి, మధుబాల, సచిన్ ఖేడేకర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 17న శాకుంతలంను రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments