పులే రెండడుగులు వెనక్కి వేస్తే.. అక్కడికి పుష్పా వచ్చాడని: బన్నీ బర్త్‌డేకి ఫ్యాన్స్‌కి విందు భోజనమే
Send us your feedback to audioarticles@vaarta.com
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప 2’’ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేల ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హీరోయిన్ రష్మిక మందన్న పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేసిన ‘‘where is pushpa’’ గ్లింప్స్ మోత మోగించింది. అప్పుడే బన్నీ బర్త్ డే నాడు కూడా మరో సర్ప్రైజ్ వుంటుందని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్నట్లుగానే ఈరోజు కూడా వేర్ ఈజ్ పుష్ప అంటూ 3 నిమిషాల నిడివి వున్న వీడియోను విడుదల చేశారు.
పుష్ప ఇంత మందికి సాయం ఎందుకు చేశాడు :
బుల్లెట్ గాయాలతో తిరుపతి జైలు నుంచి తప్పించుకున్న పుష్ప కోసం గాలింపు చర్యలు అని న్యూస్ రీడర్స్ చెప్పడం, ప్రజలు టీవీలకు అతుక్కుపోవడంతో పాటు అతని మద్ధతుదారులు చేసిన ఆందోళన, పోలీసుల లాఠీఛార్జ్ ఇవే చూపించారు. అయితే తొలి భాగంలో ఎర్రచందనం స్మగ్లింగ్ సామ్రాజ్యానికి కింగ్‌గా పుష్ప ఎలా మారాడు అన్న దానిని చూపించిన సుక్కూ.. ఈసారి మాత్రం అతనిలో మానవతావాదాన్ని చూపించారు. వేలాది మందికి అతను సాయం చేసినట్లుగా గ్లింప్స్‌లో క్లారిటీ ఇచ్చాడు. తిరుపతి, చిత్తూరు ఏరియాలతో పాటు ఫారిన్‌లోనూ పుష్ప కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ జరగుతున్నట్లు చూపించారు.
గ్లింప్స్‌తో హైప్ క్రియేట్ చేస్తోన్న సుకుమార్ :
చివరికి అడవిలో పులుల జాడ తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేసిన నైట్ విజన్ కమెరాల్లో ఓ పులి కొండ రాళ్ల వెనుక నుంచి వస్తుంది. దాని పక్క గుండా ముసుగు కప్పుకున్న ఓ ఆకారం నడుచుకుంటూ వెళ్తుంది. దానిని టీవీ వాళ్లు జూమ్ చేసి చూపిస్తుండగా ఓ డైలాగ్ వస్తుంది. ‘‘అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్ధం. అదే పులే రెండు అడుగులు వెనక్కి వేస్తే పుష్ప వచ్చాడని అర్ధం’’ అంటూ చీకటిలో మెరుస్తున్న కళ్లతో వున్న అల్లు అర్జున్ ముఖాన్ని చూపిస్తారు. దీంతో పుష్ప అన్న బతికే వున్నాడంటూ జనం సంబరాలు జరుపుకోవడాన్ని గ్లింప్స్‌లో చూపించారు. మొత్తం మీద ఈ వీడియోతో సుకుమార్ చాలా సస్పెన్స్ క్రియేట్ చేశాడు. పుష్ప ఎందుకు తప్పించుకున్నాడు, అతనిని షూట్ చేసింది ఎవరు..? జనానికి ఎందుకు సాయం చేశాడనే ప్రశ్నలు జనంలో కలగాలని .. తద్వారా పుష్ప 2కి హైప్ తీసుకురావాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన వీడియో అంచనాలను భారీగా పెంచేసింది.
మైత్రి మూవీస్, విత్ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తుండగా.. అనసూయ, సునీల్, ధనుంజయ్, రావు రమేశ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అతి త్వరలోనే ‘‘పుష్ప 2’’ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments