Cricket World Cup:క్రికెట్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది, భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?
- IndiaGlitz, [Tuesday,June 27 2023]
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌ను మంగళవారం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసింది. దీని ప్రకారం టోర్నీ అక్టోబర్ 5న మొదలై.. నవంబర్ 19న ముగియనుంది. అహ్మదాబాద్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్- న్యూజిలాండ్‌లు తలపడతాయి. ఇక టీమిండియా అక్టోబర్ 8న ప్రపంచకప్‌లో తన ప్రస్థానాన్ని కొనసాగించనుంది. చెన్నైలో జరిగే మ్యాచ్‌లో మాజీ విశ్వవిజేత ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఇక టోర్నీకే హైలైట్‌గా నిలిచే భారత్-పాకిస్తాన్ హైవోల్టేజ్ మ్యాచ్ అక్టోబర్ 15న జరగనుంది.
టీమిండియా మ్యాచ్‌ల షెడ్యూల్ :
అక్టోబర్ 8: భారత్ - ఆస్ట్రేలియా (చెన్నై)
అక్టోబర్ 11: భారత్ - ఆఫ్ఘనిస్తాన్ (ఢిల్లీ)
అక్టోబర్ 15: భారత్ - పాకిస్తాన్ (అహ్మదాబాద్)
అక్టోబర్ 19: భారత్ - బంగ్లాదేశ్ (పూణే)
అక్టోబర్ 22: భారత్ - న్యూజిలాండ్ (ధర్మశాల)
అక్టోబర్ 29: భారత్ - ఇంగ్లండ్ (లక్నో)
నవంబర్ 2: భారత్ - క్వాలిఫయర్-2 (ముంబై)
నవంబర్ 5: భారత్ - సౌతాఫ్రికా (కోల్‌కతా)
నవంబర్ 11: భారత్ - క్వాలిఫయర్-1 (బెంగళూరు)
నాకౌట్ మ్యాచ్‌లు:
నవంబర్ 15: సెమీఫైనల్-1 (ముంబై)
నవంబర్ 16: సెమీఫైనల్-2 (కోల్‌కతా)
నవంబర్ 19: ఫైనల్ (అహ్మదాబాద్)