Cricket World Cup:క్రికెట్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది, భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?

  • IndiaGlitz, [Tuesday,June 27 2023]

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను మంగళవారం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసింది. దీని ప్రకారం టోర్నీ అక్టోబర్ 5న మొదలై.. నవంబర్ 19న ముగియనుంది. అహ్మదాబాద్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్- న్యూజిలాండ్‌లు తలపడతాయి. ఇక టీమిండియా అక్టోబర్ 8న ప్రపంచకప్‌లో తన ప్రస్థానాన్ని కొనసాగించనుంది. చెన్నైలో జరిగే మ్యాచ్‌లో మాజీ విశ్వవిజేత ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఇక టోర్నీకే హైలైట్‌గా నిలిచే భారత్-పాకిస్తాన్ హైవోల్టేజ్ మ్యాచ్ అక్టోబర్ 15న జరగనుంది.

టీమిండియా మ్యాచ్‌ల షెడ్యూల్ :

అక్టోబర్‌ 8: భారత్ - ఆస్ట్రేలియా (చెన్నై)
అక్టోబర్‌ 11: భారత్ - ఆఫ్ఘనిస్తాన్‌ (ఢిల్లీ)
అక్టోబర్‌ 15: భారత్ - పాకిస్తాన్‌ (అహ్మదాబాద్‌)
అక్టోబర్‌ 19: భారత్ - బంగ్లాదేశ్‌ (పూణే)
అక్టోబర్‌ 22: భారత్ - న్యూజిలాండ్‌ (ధర్మశాల)
అక్టోబర్‌ 29: భారత్ - ఇంగ్లండ్‌ (లక్నో)
నవంబర్‌ 2: భారత్ - క్వాలిఫయర్‌-2 (ముంబై)
నవంబర్‌ 5: భారత్ - సౌతాఫ్రికా (కోల్‌కతా)
నవంబర్‌ 11: భారత్ - క్వాలిఫయర్‌-1 (బెంగళూరు)

నాకౌట్‌ మ్యాచ్‌లు:

నవంబర్ 15: సెమీఫైనల్-1 (ముంబై)
నవంబర్‌ 16: సెమీఫైనల్‌-2 (కోల్‌కతా)
నవంబర్‌ 19: ఫైనల్‌ (అహ్మదాబాద్‌)

More News

Pawan Kalyan : స్వల్ప అనారోగ్యానికి గురైన పవన్ కళ్యాణ్.. నేతలతో మీటింగ్ వాయిదా, టెన్షన్‌లో ఫ్యాన్స్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. వారాహి విజయ యాత్రలో భాగంగా ప్రస్తుతం ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో

Pawan Kalyan:ప్రభాస్ సినిమాలు చేసి సంపాదిస్తే.. జగన్ అక్రమాలతో వెనకేశారు : నర్సాపురంలో పవన్

వారాహి విజయయాత్రలో భాగంగా సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించారు.

Jr Ntr Fan:ఎన్టీఆర్ వీరాభిమాని మృతిపై మిస్టరీ : జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోన్న ఫ్యాన్స్ , ట్రెండింగ్‌లో #WeWantJusticeForShyamNTR

యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌కు ప్రాంతాలు, కుల, మతాలకు అతీతంగా కోట్లాది మంది అభిమానులు వున్నారు.

KTR:కేసీఆర్‌తో పెట్టుకున్న వారెవరూ బాగుపడలేదు.. జేపీ నడ్డాకు కేటీఆర్ స్టైల్ వార్నింగ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పెట్టుకున్న ఏ ఒక్కరూ బాగుపడలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,

Owaisi:మా వాళ్లనే అరెస్ట్ చేస్తారా, బోధన్‌లో బీఆర్ఎస్‌ను ఓడిస్తాం .. మరిన్ని స్థానాల్లోనూ బరిలోకి ఎంఐఎం: ఒవైసీ

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు .. ఆయనకు మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.