ఉప రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లలో అపశృతి : శిల్పకళావేదికలో ప్రమాదం, ఐబీ అధికారి మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్లోని శిల్పకళావేదిక వద్ద ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటన ఏర్పాట్లలో అపశృతి చోటుచేసుకుంది. కుమార అమ్మిరేశ్ అనే డీఎస్పీ క్యాడర్ అధికారి ప్రమాదవశాత్తూ మృతి చెందారు. మాదాపూర్ శిల్పకళా వేదికలో ఎల్లుండి జరగబోయే దివంగత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి బుక్ ఆవిష్కరణ కార్యక్రమానికి వెంకయ్య నాయుడు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటుకు సంబంధించి నివేదిక ఇవ్వడం కోసం రిహార్సల్స్ ప్రోగ్రాంలో పాల్గొన్న డీఎస్పీ స్టేజి సమీపంలో ఉన్న గుంతలో పడిపోయారు.
ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను సిబ్బంది ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మృతుడిని ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న కుమార్ అమ్మిరేశ్గా గుర్తించారు. ఆయన స్వస్థలం బీహార్ . అతనికి భార్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్టుగా తెలిసింది. డీఎస్పీ స్థాయి అధికారి మరణంతో అధికార వర్గాలు విషాదంలో మునిగిపోయాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మరోవైపు .. ఐబీ అధికారి మరణంపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ శుక్రవారం నాడు తాను పాల్గొననున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి పుస్తకావిష్కరణ కార్యక్రమం ముందస్తు ఏర్పాట్లలో భాగంగా, హైదరాబాద్ శిల్పకళావేదికలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఇంటిలిజెన్స్ విభాగ పోలీసు అధికారి కుమార్ అమిర్నేష్ ప్రమాదవశాత్తు మృతి చెందారన్న వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. వారి మృతి అత్యంత విచారకరం. కుమార్ అమిర్నేష్ గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. అంటూ వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout