IAS Officers Transfer: తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌లు బదిలీ.. స్మితా సభర్వాల్‌కు కొత్త పోస్ట్..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్‌ల బదిలీ జరిగింది. ఏకంగా 26 మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ఉన్న స్మితా సభర్వాల్‌ను రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా నియమించింది. అలాగే సంగారెడ్డి, మహబూబాబాద్, గద్వాల, నల్గొండ జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ.. కొత్త కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు.
అధికారుల బదిలీ జాబితా ఇదే..
సీఎంవో జాయింట్ సెక్రటరీగా సంగీత సత్యనారాయణ
ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా స్మితా సభర్వాల్
నీటిపారుదలశాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా
పురావస్తుశాఖ డైరెక్టర్‌గా భారతి హోళికేరి
గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్ దత్ ఎక్కా
ప్రణాళికాశాఖ ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నజీద్
బీసీ సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శిగా బుర్రా వెంకటేశం
జీఏడీ కార్యదర్శిగా ఎం.రఘునందన్‌రావు
పంచాయతీరాజ్, ఆర్‌డీ కార్యదర్శిగా సందీప్ సుల్తానియా
ఆయుష్ డైరెక్టర్‌గా ఎం.ప్రశాంతి
ఫైనాన్స్, ప్లానింగ్ ప్రత్యేక కార్యదర్శిగా కృష్ణభాస్కర్
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్‌గా డి. దివ్య
ట్రైబల్ వెల్ఫేర్ కార్యదర్శిగా శరత్
పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య డైరెక్టర్‌గా చిట్టెం లక్ష్మీ
కార్మికశాఖ కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య
మైనార్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఎ.ఎం.ఖానమ్
జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్
హైదరాబాద్(స్థానిక సంస్థలు) అడిషనల్ కలెక్టర్‌గా పి. కదిరావన్
నల్గొండ జిల్లా కలెక్టర్‌గా దాసరి హరి చందన
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా అద్వైత్ కుమార్ సింగ్
రంగారెడ్డి కలెక్టర్‌గా శశాంక
సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా వల్లూరు క్రాంతి
గద్వాల జిల్లా కలెక్టర్‌గా బీఎం. సంతోష్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments