శ్రీశైలంలో ప్రతిధ్వనిస్తున్న పురాణపండ శ్రీనివాస్ 'హరోంహర'
Send us your feedback to audioarticles@vaarta.com
అంతర్గత శక్తులతో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే అద్భుత రచనలు చేయడంలో తన సృజనాత్మకతను ఒక పద్ధతి ప్రకారం పనిచేయించడంలో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ చూపే చొరవ అమోఘమని భారత కేంద్రప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి రెడ్డి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.
శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో సోమవారం ఉదయం తన భార్య సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారిణి శ్రీమతి పుష్పా సుబ్రహ్మణ్యంతో కలసి అభిషేకాలు నిర్వహించిన సుబ్రహ్మణ్యం ఈ సందర్భంలో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ దివ్య రచన ‘ హరోంహర ‘ దివ్య గ్రంధాన్ని ఆవిష్కరించారు. తాను ఏ శాఖలో వున్నా ఆ శాఖకు ఎవరో ఒకరి ద్వారా పురాణపండ శ్రీనివాస్ అద్భుత రచనలు అందుతూనే ఉన్నాయని, మానసిక ప్రగాఢ ప్రతిష్టాపన ఉండడంవల్లనే శ్రీనివాస్ ఇలాంటి అపురూప పవిత్ర కార్యాలు చేస్తున్నారని ప్రశంసించారు. తొలి ప్రతిని శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణ అధికారి కె.ఎస్. రామారావు కి అందజేశారు.
ఈ సందర్భంలో శ్రీమతి పుష్ప సుబ్రహ్మణ్యం భక్తులకు తన స్వహస్తాలా హరోంహర గ్రంథాల్ని వితరణ చేశారు. ఇలాంటి మహత్తర గ్రంధాన్ని ఏడువేల ప్రతులను ఈ కార్తీకంలో దేవస్థానానికి సమర్పించిన హిందూపూర్ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ , వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి , శ్రీమతి రజని కొర్రపాటి దంపతులకు శ్రీశైల దేవస్థానం సహాయ కార్యనిర్వహణ అధికారి ఎస్..వి. కృష్ణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
ఈనెల అంతా జరిగే రుద్రాభిషేకాలలో పాల్గొనే భక్తులకు, కార్తీక దీపోత్సవాలలో పాల్గొనే భక్త బృందాలకు ఈ హరోంహర గ్రంధాన్ని దేవస్థానం పక్షాన ఉచితంగా ఇస్తామని, త్వరలోనే పురాణపండ శ్రీనివాస్ శ్రీ దేవస్థానానికి ఒక శైవ మంత్రపేటికను అందిస్తే చాలా సంతోషిస్తామని , శ్రీశైల మహాలింగం కటాక్షం ఎల్లప్పుడూ శ్రీనివాస్ కి ఉంటుందని కార్యనిర్వహణాధికారి రామారావు ఆశాభావం వ్యక్తం చేశారు . ఈ శివ కార్యంలో శ్రీశైలప్రభ మాసపత్రిక సంపాదకులు సి. అనిల్ కుమార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments