KTR: జగనన్నతో మాట్లాడి జాగా ఇప్పిస్తా.. కలిసి ఉంటే కలదు సుఖం అంటున్న కేటీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో కూడా ఐటీ కంపెనీలు పెట్టాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడిన మాటలపై తెలుగు రాష్ట్రాల్లో హర్షాతిరేకాలు వస్తున్నాయి. మా రాష్ట్రమే ప్రగతి సాధించాలి.. మా రైతులే బాగుండాలి.. మా రాష్ట్రంలోనే కంపెనీలు ఉండాలి.. అని కోరుకునే ఈరోజుల్లో కేటీఆర్ విజ్ఞత, విశాల దృక్పథంతో మాట్లాడారని ప్రశంసిస్తున్నారు.
ఏపీలోని భీమవరం, నెల్లూరులో కూడా ఐటీ కంపెనీలు పెట్టాలి..
వరంగల్ సమీపంలోని మడికొండ ఐటీ పార్క్‌లో రూ.40 కోట్లతో ఏర్పాటు చేసిన క్వాట్రెండ్ సాఫ్ట్‌వేర్ కంపెనీని శుక్రవారం కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలోని భీమవరం, నెల్లూరులో కూడా ఐటీ కంపెనీలు పెట్టాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు. ఈ క్రమంలో అవసరమైతే జగనన్నతో మాట్లాడి అక్కడ స్థలం కూడా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. టాలెంట్ ఎవరబ్బ సొత్తు కాదని, టాలెంట్ ఉంటే ఎక్కడైనా కంపెనీలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించవచ్చునని చెప్పారు.
భవిష్యత్‌లో విశాఖ కూడా గొప్ప అభివృద్ధి కేంద్రం కానుంది..
తెలంగాణ ఒక్కటే కాదు ఆంధ్రలోని పట్టణాల్లో సైతం మున్ముందు ఐటి పరిశ్రమలు వస్తాయని కేటీఆర్ చేసిన ప్రకటన ఆయన ముందు చూపునకు నిదర్శనమని అంటున్నారు. అంతేకాకుండా జగనన్నతో మాట్లాడి కంపెనీలకు జాగా ఇప్పిస్తాను అని చెప్పడంతో ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఎంత చక్కగా ఉన్నాయన్నది అందరికీ అర్థమైందని చెబుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ తరువాత విశాఖలో కూడా ఐటీ పరిశ్రమ త్వరితంగా వృద్ధి చెందుతోంది. అదాని డేటా సెంటర్.. ఇంకొన్ని ఐటి పరిశ్రమలు విశాఖ వైపు చూస్తుండటంతో రానున్న రోజుల్లో విశాఖ కూడా గొప్ప అభివృద్ధికి కేంద్రం కానుందని నిపుణులు కూడా చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments