KTR: జగనన్నతో మాట్లాడి జాగా ఇప్పిస్తా.. కలిసి ఉంటే కలదు సుఖం అంటున్న కేటీఆర్

  • IndiaGlitz, [Saturday,October 07 2023]

ఏపీలో కూడా ఐటీ కంపెనీలు పెట్టాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడిన మాటలపై తెలుగు రాష్ట్రాల్లో హర్షాతిరేకాలు వస్తున్నాయి. మా రాష్ట్రమే ప్రగతి సాధించాలి.. మా రైతులే బాగుండాలి.. మా రాష్ట్రంలోనే కంపెనీలు ఉండాలి.. అని కోరుకునే ఈరోజుల్లో కేటీఆర్ విజ్ఞత, విశాల దృక్పథంతో మాట్లాడారని ప్రశంసిస్తున్నారు.

ఏపీలోని భీమవరం, నెల్లూరులో కూడా ఐటీ కంపెనీలు పెట్టాలి..

వరంగల్ సమీపంలోని మడికొండ ఐటీ పార్క్‌లో రూ.40 కోట్లతో ఏర్పాటు చేసిన క్వాట్రెండ్ సాఫ్ట్‌వేర్ కంపెనీని శుక్రవారం కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలోని భీమవరం, నెల్లూరులో కూడా ఐటీ కంపెనీలు పెట్టాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు. ఈ క్రమంలో అవసరమైతే జగనన్నతో మాట్లాడి అక్కడ స్థలం కూడా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. టాలెంట్ ఎవరబ్బ సొత్తు కాదని, టాలెంట్ ఉంటే ఎక్కడైనా కంపెనీలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించవచ్చునని చెప్పారు.

భవిష్యత్‌లో విశాఖ కూడా గొప్ప అభివృద్ధి కేంద్రం కానుంది..

తెలంగాణ ఒక్కటే కాదు ఆంధ్రలోని పట్టణాల్లో సైతం మున్ముందు ఐటి పరిశ్రమలు వస్తాయని కేటీఆర్ చేసిన ప్రకటన ఆయన ముందు చూపునకు నిదర్శనమని అంటున్నారు. అంతేకాకుండా జగనన్నతో మాట్లాడి కంపెనీలకు జాగా ఇప్పిస్తాను అని చెప్పడంతో ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఎంత చక్కగా ఉన్నాయన్నది అందరికీ అర్థమైందని చెబుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ తరువాత విశాఖలో కూడా ఐటీ పరిశ్రమ త్వరితంగా వృద్ధి చెందుతోంది. అదాని డేటా సెంటర్.. ఇంకొన్ని ఐటి పరిశ్రమలు విశాఖ వైపు చూస్తుండటంతో రానున్న రోజుల్లో విశాఖ కూడా గొప్ప అభివృద్ధికి కేంద్రం కానుందని నిపుణులు కూడా చెబుతున్నారు.

More News

NBK Season 3:గెట్ రెడీ.. బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్ అన్‌స్టాపబుల్ విత్ NBK 3వ సీజన్ వచ్చేస్తోంది..

నటసింహం నందమూరి బాలకృష్ణలో సరికొత్త యాంగిల్ చూపించిన అన్‌స్టాపబుల్ విత్ NBK టాక్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Israel:ఇజ్రాయెల్‌లో భీకర యుద్ధ వాతావరణం.. భారతీయులకు కీలక సూచనలు

ఇజ్రాయెల్‌లో యుద్ధ వాతావరణం నేపథ్యంలో అక్కడి భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది.

Chikoti Praveen:ఎట్టకేలకు బీజేపీలో చేరిన చీకోటి ప్రవీణ్.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన డీకే అరుణ

క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ఎట్టకేలకు తెలంగాణ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సమక్షంలో చికోటి ప్రవీణ్ కాషాయం కండువా కప్పుకున్నారు.

Asian Games:ఆసియా క్రీడల్లో దుమ్మురేపుతున్న భారత ఆటగాళ్లు.. క్రికెట్, బ్యాడ్మింటన్‌, కబడ్డీలో స్వర్ణాలు

ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. ఈవెంట్ ఏదైనా సరే మెడలే టార్గెట్‌గా దూసుకుపోతున్నారు.

MP Navneet Kaur:మంత్రి రోజాకు మద్దతుగా ఎంపీ నవనీత్ కౌర్.. బండారు వ్యాఖ్యలపై మండిపాటు

మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మహిళా ప్రముఖులు తీవ్రంగా స్పందిస్తున్నారు.