కష్టం వస్తే చెప్పండి ఆదుకుంటా: దిల్ రాజు
Send us your feedback to audioarticles@vaarta.com
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఫార్ములాను సినీ ఇండస్ట్రీ పక్కాగా ఫాలో అవుతూ ఉంటుంది. ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చిందంటే దానిని నిలబెట్టుకోవడం కోసం.. తరతరాలకు సరిపడా సంపాదించుకోవడం కోసమే జీవితమంతా కష్టపడుతుంటారు. అంతేకానీ సోషల్ సర్వీస్ వైపు పెద్దగా చూడరు. ఇండస్ట్రీలో సేవా దృక్పథం ఉన్నావారంటే.. సోనూసూద్ వంటి వారిని వేళ్లపై లెక్కబెట్టగలిగే వారిని మాత్రమే చూడగలం. కానీ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి అది కూడా మంచి సక్సెస్ బాటలో నడుస్తున్న సమయంలో నాకు సోషల్ సర్వీస్ చేయాలని ఉంది. కష్టంలో ఉన్న వారిని నా దగ్గరకు తీసుకుంటే వారికి సాయం అందిస్తానని చెప్పేవారు ఉంటారా? అంటే ఉన్నారు.. అది మరెవరో కాదు.. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు.. ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..
‘‘ఇండస్ట్రీలో సక్సెస్ అయిపోయాక.. ఎవరికైనా సేవా కార్యక్రమాల వైపు దృష్టి మరలుతుంది. కానీ నేను చాలా లక్కీఫెలో. సక్సెస్‌లో ఉండగానే ఇది జరుగుతోంది. ఇండస్ట్రీలోకి వచ్చి 25 ఏళ్లు అవుతోంది. అంటే 25 ఏళ్ల క్రితం ఇండస్ట్రాలోకి వచ్చాను. ఇక నా లైఫ్‌ని నేను షిఫ్ట్ చేయాలనుకుంటున్నా. 50 తర్వాత ఏం చేయాలని ఆలోచన వచ్చింది. సక్సెస్‌లు వచ్చాయి.. ఎదిగాం.. ఇక పేరు, డబ్బు సక్సెస్‌తో పాటు వస్తుంటాయి. ఈ మధ్యే సెకండ్ ఇన్నింగ్స్ మళ్లీ పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉన్నాను. మన కోసం బతుకుతాం.. మన కోసం సంపాదించుకుంటాం.. తరువాత ఏంటని ఆలోచిస్తుంటే.. నాకు లైఫ్‌లో రిటర్న్ చేయాలనిపించింది. చేయాలని ఈ మధ్యే నాకు అనిపిస్తోంది. సోషల్ సర్వీస్ చేయాలనుకుంటున్నా.
నాకు మీలో ఎవరైనా చేయూతనిస్తే మీడియా పరంగా చాలా బాగుంటుంది. అయితే పబ్లిసిటీ పరంగా కాదు. మా దగ్గరకు వచ్చే వాటిలో కొన్ని ఫేక్‌గా ఉండొచ్చు. ప్రాపర్ ప్రాబ్లమ్ ఉన్న దగ్గరికీ మనం రీచ్ అవ్వాలి. మీకు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. జెన్యూన్‌గా అనిపిస్తే నా దగ్గరకు తీసుకొస్తే నేను సాయం చేస్తా. మీలో ఎవరైనా ఇంట్రస్ట్‌గా ఉంటే మాతో జాయిన్ అయితే బాగుంటుంది. నేను ఎడ్యుకేషన్, హెల్త్ కోసం సాయం చేయాలనుకుంటున్నా. ఈ రెండింటినీ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. మీలో ఎవరికైనా అవసరం వస్తే నా దగ్గరకు రావొచ్చు. ఇది నా 50వ పుట్టినరోజు సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని దిల్ రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పారు.
A true king with a golden heart????Ace Producer #DilRaju announces that he'll be helping the needy in Education and Health.#IndiaGlitzTelugu #education #health pic.twitter.com/BbzdArhIi7
— IndiaGlitz™ l తెలుగు (@igtelugu) December 17, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments