ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటున్న డైరెక్టర్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటున్న డైరెక్టర్ ఎవరో కాదు అర్ధనారి డైరెక్టర్ భానుశంకర్ చౌదరి. ఇంతకీ విషయం ఏమిటంటే....రాజు మహరాజు, సరదాగా అమ్మాయితో..తదితర చిత్రాలను తెరకెక్కించిన భానుశంకర్ చౌదరి తాజాగా అర్ధనారి చిత్రాన్ని తెరకెక్కించారు.
ఈ చిత్రంలో నూతన నటీనటులు అర్జున్ యజత్, మౌర్యాని జంటగా నటించారు. పత్తికొండ సినిమాస్ బ్యానర్ పై రవికుమార్, భరత్ రాజ్, కర్లపూడి కృష్ణ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. ఇటీవల రిలీజైన అర్ధనారి చిత్రం పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ తో ప్రదర్శింపబడుతోంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో డైరెక్టర్ భాను శంకర్ చౌదరి మాట్లాడుతూ...చిన్న సినిమా బాగుంది అని టాక్ వచ్చినప్పటికీ మౌత్ టాక్ తో ప్రేక్షకులు థియేటర్స్ రావడానికి వారం రోజులుపడుతుంది. కానీ...ఇప్పుడున్న విధానం అందుకు వీలుగా లేదు. ఒక సినిమాకి వేల థియేటర్స్ ఇచ్చేస్తున్నారు. ఇండస్ట్రీని బాగుచేయడానికి ప్రస్తుతం ఉన్న థియేటర్స్ విధానం మార్చడానికి ఎవడో ఒక నాయకుడు రావాలి.
చిన్న సినిమా బాగుంది అనుకునే టైమ్ కి థియేటర్స్ లోంచి తీసేస్తున్నారు. నాకు ఆ భగవంతుడు శక్తి ఇస్తే ఖచ్చితంగా చిన్నసినిమాని బతికించడం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. ఒక ఇంటి యాజమాని సంపాదించింది అంతా అతనే తినేస్తే పిల్లల పరిస్థితి ఏమిటి..? అలాగే ఇండస్ట్రీలో పెద్ద సినిమాలకే వేల థియేటర్స్ ఇచ్చేసి...వాళ్లే డబ్బులు సంపాదించుకుంటుంటే చిన్న నిర్మాతల పరిస్థితి ఏమిటి..? అందుచేత రెండు, మూడు నెలల తర్వాత ఖచ్చితంగా ఒక ముందడుగు వేస్తాను. 100% ఇండస్ట్రీలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తాను. ఇక్కడే కాదు ఎక్కడా కూడా నిజాయితీ అవసరం లేదనిపిస్తుంది అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout