మ‌రిన్ని మంచి పాత్ర‌ల‌తో అల‌రిస్తా - స‌మంత‌

  • IndiaGlitz, [Saturday,November 18 2017]

'ఏం మాయ చేసావే' సినిమాతో తెరంగేట్రం చేసిన హీరోయిన్ సమంత. గ్లామర్ రోల్స్ తో పాటు అవకాశం వచ్చినప్పుడల్లా పెర్ఫార్మన్స్ బేస్డ్ రోల్స్ కూడా చేస్తోంది సామ్. ఇలా చేసిన‌ 'ఎటో వెళ్లి పోయింది మనసు', 'మనం', 'రాజు గారి గది 2' లాంటి సినిమాలు న‌టిగా తనకి మంచి పేరును తెచ్చిపెట్టాయి.

ఒక తెలుగు సినిమాల్లోనే కాకుండా తమిళం లో కూడా తన కంటూ మార్కెట్ ని క్రియేట్ చేసుకుంది ఈ చెన్నై చిన్న‌ది. తాజాగా నాగ చైతన్యని పెళ్లాడిన స‌మంత‌.. పెళ్లి తర్వాత సినిమాలకు కొంత కాలం గ్యాప్ తీసుకుంటుందని మీడియాలో ఆ మ‌ధ్య‌ వార్తలు వినిపించాయి.

అయితే ఈ మధ్య ఒక ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. ఇప్పటిలో సినిమాలకు గుడ్ బై చెప్పడం గాని, గ్యాప్ తీసుకునే ఆలోచన గాని లేదని కుండ బద్దలు కొట్టింది. ఇంతవరకు తనకి నచ్చిన, తన కోసమే డిజైన్ చేసిన మంచి రోల్స్ వ‌చ్చాయ‌ని.. అది ఒక వరంగా భావించి భ‌విష్య‌త్‌లో కూడా మరిన్ని మంచి పాత్రలు చేయాలని వుందని, చేస్తానని ఆశా భావం వ్యక్తం చేసింది స‌మంత‌ .