భవిష్యత్ లో 'రోబో' ఫ్రాంచైజీలను డైరెక్ట్ చేస్తా.....

  • IndiaGlitz, [Monday,November 21 2016]

సూపర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, డైరెక్ట‌ర్ శంక‌ర్‌, బాలీవుడ్ స్టార్ అక్ష‌య్‌కుమార్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సైంటిఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ '2.0'. 2010లో విడుద‌లైన రోబో ఎంత‌టి సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. ఆరేళ్ల త‌ర్వాత ఈ రోబో సీక్వెల్‌గా వ‌స్తున్న 2.0పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. సుభాష్ క‌ర‌ణ్ స‌మ‌ర్ప‌ణ‌లో లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌ఫై 350 కోట్ల భారీ బ‌డ్టెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రం ఫ‌స్ట్‌లుక్ ముంబైలో విడుద‌లైంది. సినిమాను దీపావ‌ళి సంద‌ర్భంగా 2017లో విడుద‌ల చేయ‌నున్నారు.

ఈ ఫ‌స్ట్‌లుక్‌ వేడుక‌లో ద‌ర్శ‌కుడు శంక‌ర్‌ను రోబో ఫ్రాంచైజీని కంటిన్యూ చేసే ఆలోచ‌న ఉందా అని ఓ విలేఖ‌రి ఓ ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న వేశారు...దానికి రోబో ఫ్రాంచైజీ చేసే సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ అని చేసేలా ఆలోచ‌న ఉంది. త‌ప్ప‌కుండా 3.0, 4.0, 5.0 చేస్తాన‌ని చెప్పుకొచ్చారు. అలాగే రోబో చేసేట‌ప్పుడు ఎవ‌రెస్ట్ ప‌ర్వ‌తాన్ని ఎక్కుతున్నాన‌నే టెన్ష‌న్ క‌లిగింది. కానీ సీక్వెల్ చేస్తున్న‌ప్పుడు ఎవ‌రెస్ట్‌ను భుజాల‌పైకెత్తుకుని ఎవ‌రెస్ట్ ఎక్కుతున్నంత టెన్ష‌న్ ఉంద‌ని చెప్పుకొచ్చారు.