ఊపిరి - 2 లో నాగ్ సార్ తో డాన్స్ చేస్తా - తమన్నా...
Wednesday, March 16, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నాగార్జున - కార్తీ - తమన్నా కాంబినేషన్లో రూపొందిన భారీ మల్టీస్టారర్ ఊపిరి. వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళ్ లో ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ నిర్మించింది. ఊపిరి ఆడియో ఫంక్షన్ లో నాగ్ మాట్లాడుతూ...నన్నువీల్ ఛైర్ లో కూర్చొబెట్టి కార్తీ - తమన్నా డ్యూయోట్స్ పాడుకోవడంతో కోపం వచ్చిందన్నారు సరదాగా...ఇదే విషయాన్ని తమన్నాకి చెబితే...ఊపిరి లో కుదరకపోతేనే..ఊపిరి 2 లో నాగ్ సార్ తో కలసి డాన్స్ చేస్తాను అంది. ఊపిరి - 2 గురించి అనవసరంగా చెప్పేసాను అనుకుందో ఏమో.. వెంటనే సరదాగా అన్నాను.
ఊపిరి - 2 ప్లాన్ ఏమీ లేదు అని చెప్పింది. తమన్నాసరదాగానే చెప్పిందో..లేక ఊపిరి టీమ్ కి ఊపిరి - 2 తీయాలనే ప్లాన్ ఉందో తెలియదు. కానీ...ఊపిరి ట్రైలర్ లాస్ట్ లో బైక్ పై కూర్చున్న నాగ్ చేతులు చాపి పైకి చూస్తంటాడు సంతోషంగా. ఈ సన్నివేశాన్ని బట్టి చేతులు కదపలేని నాగ్ కి సినిమా చివరల్లో ఆ వ్యాధి తగ్గిపోతుందమో అనిపిస్తుంది. కాబట్టి ఆతర్వాత ఏం జరిగిందనే పాయింట్ తో ఊపిరి - 2 తీస్తే బాగానే ఉంటుంది. మరి...సరదాగా చెప్పిన తమన్నా మాట నిజం అవుతుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments