ఊపిరి - 2 లో నాగ్ సార్ తో డాన్స్ చేస్తా - తమన్నా...

  • IndiaGlitz, [Wednesday,March 16 2016]
నాగార్జున - కార్తీ - త‌మ‌న్నా కాంబినేష‌న్లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ ఊపిరి. వంశీ పైడిప‌ల్లి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. తెలుగు, త‌మిళ్ లో ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ నిర్మించింది. ఊపిరి ఆడియో ఫంక్ష‌న్ లో నాగ్ మాట్లాడుతూ...న‌న్నువీల్ ఛైర్ లో కూర్చొబెట్టి కార్తీ - త‌మ‌న్నా డ్యూయోట్స్ పాడుకోవడంతో కోపం వ‌చ్చింద‌న్నారు స‌ర‌దాగా...ఇదే విష‌యాన్ని త‌మ‌న్నాకి చెబితే...ఊపిరి లో కుద‌ర‌క‌పోతేనే..ఊపిరి 2 లో నాగ్ సార్ తో క‌ల‌సి డాన్స్ చేస్తాను అంది. ఊపిరి - 2 గురించి అన‌వ‌స‌రంగా చెప్పేసాను అనుకుందో ఏమో.. వెంట‌నే స‌ర‌దాగా అన్నాను.
ఊపిరి - 2 ప్లాన్ ఏమీ లేదు అని చెప్పింది. త‌మ‌న్నాస‌ర‌దాగానే చెప్పిందో..లేక ఊపిరి టీమ్ కి ఊపిరి - 2 తీయాల‌నే ప్లాన్ ఉందో తెలియ‌దు. కానీ...ఊపిరి ట్రైల‌ర్ లాస్ట్ లో బైక్ పై కూర్చున్న నాగ్ చేతులు చాపి పైకి చూస్తంటాడు సంతోషంగా. ఈ స‌న్నివేశాన్ని బ‌ట్టి చేతులు క‌ద‌ప‌లేని నాగ్ కి సినిమా చివ‌ర‌ల్లో ఆ వ్యాధి త‌గ్గిపోతుంద‌మో అనిపిస్తుంది. కాబ‌ట్టి ఆత‌ర్వాత ఏం జ‌రిగింద‌నే పాయింట్ తో ఊపిరి - 2 తీస్తే బాగానే ఉంటుంది. మ‌రి...స‌ర‌దాగా చెప్పిన త‌మ‌న్నా మాట నిజం అవుతుందేమో చూడాలి.

More News

రాజకీయాల్లోకి విశాల్....

తెలుగువాడైన తమిళ హీరో విశాల్ త్వరలోనే రాజకీయాల్లో చేరబోతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.

ధ‌నుష్ మూవీలో న‌టిస్తున్నతెలుగు హీరో..

ధ‌నుష్ హీరోగా గౌత‌మ్ వాసుదేవ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం చెన్నైలో ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే..

ఆ ఎమ్మెల్యేకు శిక్ష పడాలంటున్న త్రిష...

ఇప్పుడు హీరోయిన్స్ అందరూ జంతువులపై  ప్రేమానురాగాలు చూపిస్తున్నారు. జంతువులకు సంబంధించిన స్వచ్చంద సంస్థలకు తమ వంతు మద్ధతును ప్రకటిస్తున్నారు.

అదే నా ల‌క్ష్యం అంటున్న త‌మ‌న్నా..

తెలుగు, త‌మిళ్, హిందీ...భాష‌ల్లో న‌టిస్తూ..త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న క్రేజీ హీరోయిన్ మిల్కీబ్యూటీ త‌మ‌న్నా. తెలుగు, త‌మిళ్ లో భారీ బ‌డ్జెట్ తో రూపొందిన ద్విభాషా చిత్రం ఊపిరి లో త‌మ‌న్నా న‌టించింది.

మ‌నం ఎవ‌రికీ త‌క్కువ కాదంటున్నసుధీర్ బాబు..

ఎస్.ఎం.ఎస్ చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మై..ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ తో స‌క్సెస్ సాధించిన యువ క‌థానాయ‌కుడు సుథీర్ బాబు.