ఆ విషయం తెలిసి షాకయ్యాను: పవన్‌కల్యాణ్
- IndiaGlitz, [Tuesday,November 10 2020]
జనసేనాని, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాంటూ విజ్జప్తి చేశారు. వ్యాక్సిన్ రూపొందే ప్రక్రియలు జరుగుతున్నాయని, టీకా వచ్చే వరకు తగు జాగ్రత్తలు తీసుకోవడమే మంచిదని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి కరోనా వైరస్ సోకండంపై ఆయన స్పందించారు. ‘‘అన్నయ్యకు కరోనా పాజిటివ్ అని తెలిసి షాకయ్యాం. కోవిడ్ కారణంగా లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి అన్నయ్య తగు జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. అంతే కాదు.. అందరిలో అవగాహన పెంచడానికి పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అన్నయ్యకు కరోనా రావడంతో అందరం షాకయ్యాం. అయితే ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవు. అన్నయ్య సత్వరమే కోలుకోవాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను’’ అన్నారు.
సినిమాల విషయానికి వస్తే పవన్ ప్రస్తుతం ‘వకీల్‌సాబ్’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. దీని తర్వాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్‌లో నటించబోతున్నారు.