చాలా సార్లు ఆ ఆఫర్ రిజెక్ట్ చేశా.. ఫైనల్ డెసిషన్ ఇదే : భూమిక
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్ భూమిక గురించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్, మహేష్, ఎన్టీఆర్ సరసన నటించిన భూమిక తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. లేడీ ఓరియేంటేడ్ చిత్రాలలో కూడా భూమిక నటించింది. గ్లామర్, నటన పరంగా ఫుల్ మర్క్స్ వేయించుకుంది భూమిక.
వివాహం తర్వాత సినిమాల జోరు తగ్గించినప్పటికీ అప్పుడప్పుడూ క్యారెక్టర్ రోల్స్ చేస్తోంది. చాలా కాలంగా తనపై జరుగుతున్న ప్రచారానికి భూమిక ఫుల్ స్టాప్ పెట్టింది. ఇండియా మొత్తం విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా బిగ్ బాస్ షో నడుస్తోంది.
సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 15లో భూమిక కంటెస్టెంట్ గా ఎంపికైందని, ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ బాలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా భూమిక స్పందించింది.
'నాకు బిగ్ బాస్ 1,2,3 తో పాటు మరికొన్ని సీజన్స్ లో ఆఫర్స్ వచ్చాయి. వాటన్నింటిని నేను రిజెక్ట్ చేశాను. బిగ్ బాస్ 15లో చేయబోతున్నానంటూ వస్తున్న వార్తలు అవాస్తవం. ఒకవేళ ఆఫర్ వచ్చినా నేను చేయను' అని భూమిక తేల్చి చెప్పేసింది.
తాను పబ్లిక్ పర్సన్ అయినప్పటికీ ఇలా పూర్తిగా మీడియా తన మీద దృష్టి పెట్టడం సరికాదు అని భూమిక తెలిపింది. ప్రస్తుతం భూమిక.. గోపీచంద్ 'సీటిమార్' చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments