‘వకీల్ సాబ్’ చూస్తూ మైమరిచిపోయా.. : దిల్ రాజు
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం 'వకీల్ సాబ్'. నేడు(శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం అందుకోవడం ఖాయమనే టాక్‌ను సంపాదించుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని సెంటర్స్ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో చిత్ర యూనిట్ చాలా హ్యాపీగా ఉంది. దీంతో 'వకీల్ సాబ్' చిత్ర బృందం హైదరాబాద్ లోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయంలో సక్సెస్ సంబరాలు జరుపుకుంది. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు తదితరులు పాల్గొన్నారు. చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్‌ను నిర్మాత దిల్ రాజు శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. లైఫ్ లో ఎన్నో సక్సెస్ లు చూశానని... నిర్మాతగా మారి 18 ఏళ్లవుతోందని... డిస్ట్రిబ్యూటర్‌గా అంతకుముందు నుంచే విజయాలు చూశానన్నారు. అయితే వకీల్ సాబ్ సక్సెస్ ఎందుకో కొత్తగా అనిపిస్తోందన్నారు. ఉదయం 4.30 కూకట్‌పల్లిలో ప్రీమియర్ షోస్ చూశానని... ప్రేక్షకుల మధ్యలో సినిమా చూస్తుంటే మైమరిచిపోయానన్నారు. నిర్మాతనని మర్చిపోయి ఫ్యాన్స్ లాగే పేపర్స్ విసిరేశానన్నారు. పది నిమిషాల తర్వాత రియలైజ్ అయ్యానని... వకీల్ సాబ్ మీద మాసివ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయన్నారు. సినిమాను ఒక్కో స్టేజీలో చూస్తుంటే ఇలాంటి ఘన విజయాన్ని అంచనా వేశామన్నారు. ప్రేక్షకులు, అభిమానుల మధ్యలో సినిమా చూస్తుంటే ఒక అద్భుతమైన ఫీలింగ్ కలిగిందన్నారు. అప్పటికే అమెరికా, దుబాయ్ షోస్ నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయని... విదేశాల నుంచి సినిమా సూపర్ హిట్ అనే టాక్ వచ్చిందన్నారు. వకీల్ సాబ్ విజయం తనకు కొత్తగా అనిపించడానికి కారణం.. తాను పవన్‌తో సినిమా చేయాలనే కోరిక కావొచ్చన్నారు. ఈ సినిమా విజయం ఘనత దర్శకుడు శ్రీరామ్ వేణుకు ఇస్తానన్నారు.
గంటా పదిహేను నిమిషాల సెకండాఫ్ అయితే విజిల్స్, చప్పట్లు కొడుతున్నారన్నారు. సినిమా అయ్యాక దర్శకుడు వేణుకు కాల్ చేశాను. ఇద్దరం కలిసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వెళ్లాము. ఆయనకు ముందుగా చెప్పలేదు, ఆ సంతోషంలో ఆయన ఇంటికి వెళ్లాం. పవన్ గారిని కలిసి సినిమా సక్సెస్ గురించి చెప్పాం. ఆయన కూడా చాలా సంతోషంగా ఫీలయ్యారు. పవన్ చాలా సక్సెస్‌లు చూశారు కానీ వకీల్ సాబ్‌లో అమ్మాయిలు, మహిళల గొప్పదనం తెలిపే కంటెంట్ ప్రేక్షకులకు రీచ్ అయితే ఆ సంతృప్తి వేరుగా ఉంటుందన్నారు. వేణు, పవన్ ప్రతి సీన్ ఎలా చేయాలో డిస్కస్ చేసుకుని మరీ చేశారన్నారు. ఆ సీన్స్ ఇప్పుడు థియేటర్లో బాగా ఆకట్టుకుంటున్నాయన్నారు. తాను ప్రసాద్ ఐమాక్స్, సుదర్శన్ థియేటర్లకు వెళ్లి అక్కడ ఆడియెన్స్ రెస్పాన్స్ గమనించానని. టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చిందన్నారు. ఏదో తెలియని అనుభూతికి తాను లోనవుతున్నానన్నారు. ఇంతలో చాలా మంది మీడియా పర్సన్స్ ఫోన్ చేసి సినిమాను ప్రశంసిస్తూ మాట్లాడారన్నారు. మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout