వ్యక్తిగత కారణాల వల్లే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: మాధవీలత
Send us your feedback to audioarticles@vaarta.com
సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత తన రాజకీయ, సినీ, వ్యక్తిగత విషయాల గురించి ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తిక విషయాలను వెల్లడించారు. ఇటీవల తనకు ఆత్మహత్య చేసుకోవాలని ఉందంటూ ఇటీవల మాధవీలత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. దీనిపై ఆ ఇంటర్వ్యూలో ఆమె స్పందించారు. వ్యక్తిగత కారణాల వల్లే తానలా పోస్టు పెట్టానని.. కానీ తాను చాలా స్ట్రాంగ్ అని వెల్లడించారు.
‘‘డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఎవరికైనా వచ్చే మొదటి ఆలోచన. మ్యానిడేటరీ కాదు కానీ.. పెయిన్‌ని అధిగమించలేని పరిస్థితుల్లో అలాంటి భావన వస్తుంది. ఇన్ని బాధలు భరించేకంటే చచ్చిపోవడం బెటరేమో అనిపిస్తుంది. కానీ నేను చాలా స్ట్రాంగ్. డిప్రెషన్‌లో అలా అనిపిస్తుంది. అది స్ట్రాంగ్ పీపుల్ అయినా.. వీక్ పీపుల్ అయినా.. డిప్రెషన్ ఒక డిసీజ్. అలా డిప్రెషన్‌లోకి వెళ్లడానికి ఏవో వ్యక్తిగత కారణాలున్నాయి. సినిమా ఆఫర్ల గురించో.. రాజకీయ ఎదుగుదల గురించో కాదు. నేనెప్పుడు పర్సనల్ ఎమోషన్స్‌కే లొంగుతాను తప్ప ప్రొఫెషన్ నన్ను ఎమోషనల్‌గా డిప్ చేయలేదు’’ అని మాధవీలత తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com