ఇకపై తెలంగాణలోనూ తిరుగుతా.. బీసీ సీఎంను చూడాలి: పవన్

  • IndiaGlitz, [Wednesday,November 22 2023]

తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలు, గూండాలతో పోరాడుతున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తెలిపారు. హనుమకొండలో నిర్వహించిన విజయసంకల్ప సభలో పాల్గొని బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రసంగించారు. ఏపీలో తన పోరాటానికి తెలంగాణ యువత అండగా ఉంటోందన్నారు. వచ్చే ఏడాది నుంచి ఆంధ్రాలో ఎలా తిరుగుతున్నానో తెలంగాణలో కూడా అలాగే తిరుగుతానని స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చిన స్ఫూర్తితోనే పదేళ్లుగా పార్టీ నడుపుతున్నానని..

బలిదానాలపై ఏర్పడిన రాష్ట్రం అవినీతిమయం కావడం బాధ కలిగించిందన్నారు. తెలంగాణకు మద్దతు ఇచ్చిన వారిలో తాను ఒకడిని అని పేర్కొన్ఆనరు. తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయాం. బీసీ ముఖ్యమంత్రినైనా చూడాలని బీజేపీతో చేతులు కలిపానని చెప్పారు. తనకు ఆంధ్రా జన్మనిస్తే.. తెలంగాణ పునర్జన్మ ఇచ్చిందన్నారు. కమలం గుర్తుకు ఓటు వేసి రావు పద్మ, ఎర్రబెల్లి ప్రదీప్‌రావును గెలిపించాలని ఓటర్లకు పవన్‌ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.

ఈ మూడు, నాలుగు రోజులు వివిధ నియోజకవర్గాల్లో జనసేన, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా జనసేనానిన ప్రచారం చేయనున్నారు. అలాగే ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగసభలు, రోడ్ షోల్లోనూ పవన్‌ పాల్గొననున్నారు. కాగా తెలంగాణలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. 111 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీకి మద్దతు ఇస్తోంది.

More News

సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్

సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య నువ్వానేనా అనే రీతిలో ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. కొడంగల్‌లో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో

Akbaruddin Owaisi: పోలీసులను బెదిరించడంతో అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు

తెలంగాణ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలతో నేతలు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఎంఐఎం సిట్టింగ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ

Chandrababu: సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది..? చంద్రబాబు భవితవ్యంపై సస్పెన్స్..?

స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 29 నుంచి రాజకీయ కార్యకలాపాలు చేసుకోవచ్చని స్పష్టంచేసింది.

Naga Chaitanya: అభిమానుల ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్ చేసిన నాగచైతన్య

అక్కినేని హీరో నాగచైతన్య తొలిసారిగా ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి అడుగుపెట్టాడు. డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'దూత' అనే వెబ్ సిరీస్ చేశాడు. చైతూ మొదటిసారి మిస్టరీ థ్రిల్లర్ జోనర్‌లో చేస్తుండటంతో

Telangana Elections 2023 :మిగిలింది వారం మాత్రమే.. తెలంగాణలో హోరెత్తనున్న ప్రచారం..

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి మరో వారం మాత్రమే సమయం ఉంది. దీంతో అన్ని పార్టీల నేతలు ప్రచారం ముమ్మరం చేయనున్నారు. అటు కాంగ్రెస్, బీజేపీ జాతీయ నేతలందరూ తెలంగాణకు