మరో జన్ముంటే ‘జగన్’లా పుట్టాలని ఉంది!
Send us your feedback to audioarticles@vaarta.com
డైరెక్టర్ వివి వినాయక్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. వినాయక్ తెరకెక్కించిన చాలా సినిమాల్లో దాదాపు హిట్సే.. యాక్షన్‌తో పాటు కామెడీ కూడా పండించే సినిమాను బ్లాక్‌బస్టర్‌కు చేరుస్తుంటారు. వినాయక్-పూరీ జగన్నాథ్ (పూరీ జగన్) ఇద్దరూ ఆప్తమిత్రులన్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పూరీ గురించి మీ అభిప్రాయమేంటి..? ఆయనతో మీకున్న స్నేహం గురించి చెప్పండి అని వినాయక్‌ను అడగ్గా ఆసక్తికర విషయాలు మాట్లాడారు. అంతేకాదు రాజమౌళి గురించి ఆయన మాట్లాడారు.
రాజమౌళి గురించి..
రాజమౌళితో తాను చాలా స్నేహంగా ఉంటామన్నారు. రాజమౌళితో పాటు పూరీ జగన్నాథ్‌తో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటామని చెప్పుకొచ్చారు. రాజమౌళి, పూరీ, తాను ముగ్గురం మంచి స్నేహితులమన్నారు. తాను రాజమౌళి ఇంటికెళితే ఆయన, జక్కన్న కుటుంబ సభ్యులు చేసే హడావుడి అంతా ఇంత కాదని.. వాళ్లలోని ఆప్యాయత అంటే తనకు చాలా ఇష్టమన్నారు. అందరం కూడా చాలా సరదాగా మాట్లాడుకుంటామని వినాయక్ చెప్పుకొచ్చారు.
జగన్ గురించి..
తాను ఎప్పుడైనా కాస్త ‘డల్’గా అనిపించినప్పుడు పూరిని కలవాలనిపిస్తుందని.. వినాయక్ చెప్పారు. డల్‌గా ఉన్నప్పుడు పూరీకి కాల్ చేసి.. ‘బిజీగా ఉన్నావా? పూరీ.. అని కాల్ చేస్తే.. ‘ముందు వచ్చేసేయ్’ అని తప్ప మారుమాట ఆయన నుంచి రాదని వినియాక్ చెప్పుకొచ్చారు. "నిజంగా పూరీకి ఎలాంటి భయం.. టెన్షన్ లేకుండా చాలా బిందాస్‌గా ఉంటాడు. అంత స్వేచ్ఛగా వుండే ఆయనని చూసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అంతేకాదు.. మళ్లీ వచ్చే జన్మంటూ ఉంటే పూరిలా పుట్టాలనిపిస్తుంది" అని వినాయక్ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఈ మాటలు విన్న వినాయక్, పూరీ అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ ఇంటర్వ్యూ చూసి వీడియోకు అభిమానులు, నెటిజన్లు చాలా హ్యాపీగా ఫీలవుతూ.. ‘ఎస్ మీరు చెబుతున్నది నిజమే వినాయక్ సార్..’ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ జక్కన్న, పూరీ చూస్తే ఎలా ఫీలవుతారో.. ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments