BiggBoss: నా కుక్కల బొచ్చు కావాలి.. గీతూ కోరికకి షాకైన బిగ్‌బాస్, కెప్టెన్సీ రేసులో ఆ ముగ్గురు
Send us your feedback to audioarticles@vaarta.com
పుట్టినరోజు వేడుకలని చెప్పి గడిచిన రెండు రోజులుగా ఇంటిలో ఫన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నించాడు బిగ్‌బాస్. కేకు ఆశపెట్టి కంటెస్టెంట్స్ చేత ఎంటర్‌టైన్ చేయించాడు. తన కోరికలను తీర్చుకున్న బిగ్‌బాస్.. ఈరోజు ఇంటి సభ్యుల కోరికలేంటో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. రెండ్రోజుల నుంచి రోమాన్స్, కామెడీ, లవ్ ట్రాక్స్‌తో బోర్ కొడుతుందని భావించారో ఏమో కానీ సెంటిమెంట్ టచ్ ఇచ్చే యత్నం చేశారు. ఇంటి సభ్యులంతా తమ ఫీలింగ్స్ షేర్ చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకోవడమో కాకుండా... ఆడియన్స్ చేత కూడా పెట్టించారు.
శ్రీహాన్ తన పేరుతో శ్రీహాన్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా అనాథలకు , వృద్ధులకు సాయం చేయాలని కోరాడు. తాను బిగ్‌బాస్ హౌస్‌లో వున్నందున తన తల్లిదండ్రుల యోగక్షేమాలు తెలుసుకోవాల్సిందిగా ప్రియురాలు సిరి హన్మంతును కోరాడు. తన గారాలపట్టికి మంచి పేరు పెట్టాలని అడిగాడు బాలాదిత్య. మా బావ, అమ్మ ఎలా వుంటున్నారో తెలుసుకోవాలని చెప్పింది ఫైమా. రేవంత్ తన భార్య, తల్లిని తలచుకుని వాళ్లు ఎలా వున్నారో చూపించాలని కోరాడు. ఆర్జే సూర్య తన తల్లిదండ్రులు, బుజ్జమ్మ ఎలా వున్నారో చూపించాలని కోరాడు. ఇనయా కూడా తన తల్లిని తలుచుకుని ఎమోషనల్ అయ్యింది. సుదీప తన భర్త రంగనాథ్ ఫోటో, టీషర్ట్‌ను అడిగింది.
అందరిది ఒక దారైతే... తనది మరో దారని నిరూపించుకోవడానికి నానా తంటాలు పడే మన గీతూ పాప.. ఇక్కడ కూడా తన యాటిట్యూడ్ చూపించింది. అందరూ తల్లిదండ్రులనో, స్నేహితులనో, లవర్స్‌నో చూపించాలని కోరితే... గీతూ మాత్రం కుక్కల్ని తలచుకుంది. తన రెండు కుక్కల బొచ్చు కావాలని.. అది తనకు చాలా అమూల్యమైనదని చెప్పింది. ఈ మాటలతో ఇంటి సభ్యులేంటీ .. బిగ్‌బాస్ కూడా షాక్ అయ్యుంటాడు. ఇక ఆదిరెడ్డి తన కూతురి పుట్టినరోజు బిగ్‌బాస్ హౌస్‌లో జరగాలని కోరుకున్నాడు.
అనంతరం కెప్టెన్సీ కంటెండెర్స్ ఎంపిక ప్రక్రియను ప్రారంభించాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా ఈ వారం బాగా ఎంటర్‌టైన్ చేసిన ఆరుగురిని కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక చేయాల్సిందిగా కెప్టెన్ కీర్తిని ఆదేశించాడు. దీంతో ఆమె రేవంత్, సూర్య, బాలాదిత్య, రాజశేఖర్, ఫైమా, గీతూల పేర్లను చెప్పింది. దీనిపై ఇనయా హర్ట్ అయ్యింది. తనను కీర్తి కావాలనే సెలెక్ట్ చేయలేదంటూ బాధపడింది. తర్వాత ఈ ఆరుగురికి గొడ్డలితో కట్టెలు కొట్టే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. రెండు లెవెల్స్‌లో జరిగిన ఈ పోటీలో .. తొలి లెవల్‌లోనే ఫైమా, రాజ్, గీతూలు చేతులెత్తేశారు. అయితే రేవంత్, బాలాదిత్య, సూర్యలు మాత్రం సెకండ్ రౌండ్‌కి చేరుకున్నారు. ఈ ఫిజికల్ అండ్ మైండ్ గేమ్ లో సూర్య అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. దీంతో ఇనయా అతనిని గట్టిగా కౌగిలించుకుంది. మరి ఈ వారం కెప్టెన్ ఎవరు అవుతారో తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి.. బిగ్‌బాస్ 6వ సీజన్‌కి ఐదో కెప్టెన్‌గా రేవంత్ గెలిచినట్లుగా తెలుస్తోంది.
ఈ వారం ఎలిమినేషన్ లో చంటి, ఫైమా, ఇనయా, ఆదిరెడ్డి, మెరీనా, బాలాదిత్య, వాసంతి, అర్జున్ ఉన్నారు. ఇప్పటివరకు షాని, అభినయశ్రీ, నేహా చౌదరి, ఆరోహి రావు ఎలిమినేటైన విషయం తెలిసిందే. ప్రస్తుతం హౌస్ లో 17 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout