నాకు ఓ సలహా కావాలి.. ఇవ్వండి.. : ఉపాసన
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి కోడలు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. సామాజిక విషయాల్లో తన వంతుగా కృషి చేస్తుంటారు. అదే విధంగా ప్రజలకు పలు విషయాల్లో సందర్భాన్ని బట్టి అవగాహనా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంటారు. మరీ ముఖ్యంగా నిత్యం తన అభిమానులు, మెగాభిమానులు, నెటిజన్లకు సోషల్ మీడియాతో నిత్యం టచ్‌లో ఉంటుంది. తాను చేసే చేపట్టబోయే కార్యక్రమాలను నిత్యం అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఆదివారం నాడు ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది.
ఏం చేయాలో మీరే చెప్పండి!
ఇవాళ ఆదివారం కావడంతో ఫ్రీగా ఉన్న ఉపాసన.. తన ఇంట్లోని అల్మారాలు అన్నీ శుభ్రం చేసింది. వాటిని సక్రమంగా సర్దిన ఆమె.. అవసరమైనవి మాత్రమే అక్కడుంచి మిగిలినవన్నీ ప్యాక్ చేసేశారు. వాటిలో ఎన్నో దుస్తులు గుట్టలు పడ్డాయి. వీటిని ఏం చేయాలో..? ఎవరికి ఇవ్వాలో చెప్పండి..? అంటూ అభిమానులను అడిగిన ఆమె.. చివరికి వీటిని అమ్మేసి ఆ నిధులను చారిటబుల్ ట్రస్ట్‌కు ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు.
ట్వీట్ సారాంశం ఇదీ..!
‘ఇవాళ వార్డ్ రోబ్‌ను మొత్తం క్లీన్ చేశాను. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఎంతో మానసిక ప్రశాంతత లభించింది. అయితే దీనికి ఎంతో సమయం, ఎంతో శ్రమ ఖర్చైంది. నా కష్టానికి తగ్గ ఫలితం లభించింది. నాకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడంలో ఎప్పుడూ దుబారా చేయను. చాలా జాగ్రత్తగా వస్తువులు కొంటాను. అయినప్పటికీ కొన్ని దుస్తులను వార్డ్ రోబ్ నుంచి తీసేసి మూటకట్టాను. వాటిని చారిటీ సంస్థలకు నిధులు సేకరించేందుకు అమ్మేయాలని భావిస్తున్నా. మరి ఎవరికి విరాళంగా ఇస్తే బాగుంటుందో చెప్పండి’ అని నెటిజన్లును ఉపాసన సలహా కోరింది. ఈ ట్వీట్‌తో పాటు ఆ బ్యాగ్‌ల మధ్యలో కూర్చుని ఉన్న ఫొటోను చెర్రీ సతీమణి పోస్ట్ చేసింది. అయితే.. ఈ ట్వీట్‌కు మెగాభిమానులు, నెటిజన్లు చిత్ర విచిత్రాలుగా స్పందించి తమకు తోచిన సలహా ఇస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments