అమ్మా.. నా కోసం ప్రార్థించు అని అడిగేదాన్ని!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచంలో వెలకట్టలేనిది ఏదైనా ఉందా..? అని అంటే అది ఒక్క ‘తల్లి ప్రేమ’ మాత్రమే.. నవమాసాలు బిడ్డను తన గర్భంలో జాగ్రత్తగా మోసి... నొప్పులు భరించి ఆ బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అంతేకాదు తన బిడ్డ కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది తల్లి. నేడు.. ఆ మాతృమూర్తుల దినోత్సవం (మదర్స్ డే). ఈ సందర్భంగా అంతర్జాతీయంగా మదర్స్ వేడుకలను ఘనం నిర్వహించుకున్నారు. సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అమ్మతో తమకున్న అనుబంధాన్ని తెలుపుతూ పోస్ట్‌లు చేస్తున్నారు.
తాజాగా.. టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా పేరుగాంచిన సమంత మదర్స్ డే నాడు తన తల్లి గురించి ఆసక్తికర విషయం పంచుకుంది. నిత్యం సోషల్ మీడియాతో అభిమానులు, సినీ ప్రియులతో టచ్‌లో ఉండే సమంత.. మదర్స్ డే నాడు అమ్మకు శుభాకాంక్షలు చెబుతూ.. తల్లి నినెట్ ప్రభు గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసుకొచ్చింది. సమంత పోస్ట్‌కు నెటిజన్లు, అభిమానులు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు.
అమ్మా.. నా కోసం ప్రార్థించు!
"మా అమ్మ ప్రార్థనలంటే నేను నమ్ముతాను. అమ్మ చేసే ప్రార్థనల్లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుందని నా గట్టి నమ్మకం. చిన్నతనంలో మా అమ్మ దగ్గరికి వెళ్లి.. ‘అమ్మా.. నా కోసం ప్రార్థించు’ అని అడిగేదాన్ని. ఇప్పటికీ నేను ఆమె దగ్గరికి అలానే వెళ్తుంటా.. ఆమె కోరుకుంటే అన్నీ జరుగుతాయని నా నమ్మకం. మా అమ్మలోని మరో ఉత్తమమైన గుణం ఏంటంటే ఆమె ఏ రోజూ తన కోసం తాను ప్రార్థించలేదు. దేవుడి తర్వాత అమ్మే. లవ్ యు అమ్మా" అని సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌కు నెటిజన్లు రియాక్ట్ అవుతూ.. హ్యాపీ మదర్స్ డే సామ్.. సూపర్ మేడం.. అని కామెంట్ల వర్షం కురిపించగా పెద్ద ఎత్తున లైక్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com