సైన్ లాంగ్వేజ్ కోసం రెండు నెలలు ట్రైనింగ్ తీసుకున్నా: అనుష్క
Send us your feedback to audioarticles@vaarta.com
లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ అనుష్క. ‘భాగమతి’ చిత్రానికి పూర్తి భిన్నమైన చిత్రం ‘నిశ్శబ్దం’ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో ఒక ఛాలెంజింగ్ రోల్‌లో అనుష్క నటించింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల కాబోతోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని క్రితి ప్రసాద్ సమర్పణలో కోన ఫిల్మ్ కార్పోరేషన్ అసోసియేషన్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను మంగళవారం అనుష్క జూమ్ వీడియో ద్వారా మీడియాకు వెల్లడించింది.
ఈ సినిమా కోసం అమెరికా వెళ్లి సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నానని అనుష్క వెల్లడించింది. బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసం అమెరికాలో రెండు నెలలు ట్రైనింగ్ తీసుకుని మరీ ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నానని వెల్లడించింది. ప్రతిరోజూ ప్రాక్టీస్ చేసేదాన్నని పేర్కొంది. అనుష్క భాగమతి తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై అనుష్క మాట్లాడుతూ.. తాను కావాలని బ్రేక్ తీసుకోలేదని తెలిపింది.
భాగమతి తర్వాత మాత్రం కావాలనే బ్రేక్ తీసుకున్నానని వెల్లడించింది. ఆ టైమ్‌లోనే కోన వెంకట్ నిశ్శబ్దం స్ర్కిప్ట్ చెప్పారని తెలిపింది. స్ర్కిప్ట్ వినగానే చాలా కొత్తగా అనిపించిందని. కథ తనకు ఎంతగానో నచ్చిందని వెల్లడించింది. ‘నిశ్శబ్దం’మూవీలో తన క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. తన పాత్ర పేరు సాక్షి అని... తనకు ఈ చిత్రంలో వినబడదు, కనబడదని వెల్లడించింది. చాలెంజింగ్‌గా తీసుకుని మరీ ఈ పాత్ర చేశానని అనుష్క తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments