Balineni:మంత్రిగా ఉన్నప్పుడు డబ్బులు తీసుకున్నాను.. బాలినేని సంచలన వ్యాఖ్యలు..

  • IndiaGlitz, [Sunday,December 10 2023]

ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నీతిమంతుడినని చెప్పడం లేదని.. తాను మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులిస్తే తీసుకున్నానంటూ కుండబద్ధలు కొట్టారు. అయితే తాను వెయ్యి కోట్లు సంపాదించానని గిట్టని వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాలు చూస్తే తనకు ఇరిటేషన్ వస్తుందని.. అందుకే రాజకీయాలంటే విరకత్తి పుట్టిందని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో బీఆర్ఎస్ గెలవాలని మా అబ్బాయి కోరుకున్నాడని.. తెలంగాణ అంతా తిరిగి బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాడన్నారు. అయితే తాను మాత్రం కాంగ్రెస్ గెలుస్తుందని రూ.50 లక్షలు బెట్టింగ్ కాశానన్నారు. కానీ తన కుమారుడు ఫీలవుతాడని ఆ బెట్టింగ్ వెనక్కి తీసుకున్నానని వెల్లడించారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలిస్తే ఏపీలోనూ జగన్ గెలుస్తారని తన కుమారుడు అనుకున్నాడని చెప్పుకొచ్చారు. జగన్‌ అంటే తన కుమారుడికి అభిమానమని.. అయితే జగన్‌కూ తమపై అభిమానం ఉండాలి కదా అంటూ మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే జగన్ తమను నిరాదరిస్తున్నట్లు ఉందని పరోక్షంగా చెప్పినట్లు ఉంది.

అలాగే తనకు ఒంగోలులో కాకుండా వేరే నియోజకవర్గం టికెట్ ఇస్తారనే ప్రచారంపై ఆయన స్పందిస్తూ ఒంగోలులోనే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఒంగోలు కాకుండా మరో చోట పోటీ చేయనని క్లారిటీ ఇచ్చారు. నియోజకవర్గంలో పాతిక వేల ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తానని సీఎం జగన్‌కి చెప్పానని బాలినేని పేర్కొన్నారు. ప్రస్తుతం కుల ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ గెలుపు కోసం ఓ కులం ప్రజలంతా రోడ్ల మీదకు వచ్చి కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారని.. మీరంతా అండగా ఉంటేనే పోటీ చేస్తా లేదంటే చేయనని ప్రజలను ఉద్దేశించి చెప్పారు.

More News

Ram Charan : రామ్‌ చరణ్‌కు మరో ప్రతిష్టాత్మక పురస్కారం .. ‘పాప్ గోల్డెన్ అవార్డ్’ అందుకున్న మెగా హీరో

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి.. ఫైట్లు, డ్యాన్స్, నటనలో తండ్రికి తగ్గ కొడుకుగా గుర్తింపు తెచ్చుకున్నారు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్.

CM Revanth Reddy:మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Telangana Congress: కాంగ్రెస్ ప్రభుత్వంపై అప్పుల భారం.. గ్యారంటీలు నెరవేర్చడం సాధ్యమేనా..?

తెలంగాణ ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు వచ్చేశాయి. కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వెళ్లింది.

YS Jagan: మడమ నొప్పిగా ఉన్నా.. వరద బాధితులను పరామర్శించిన సీఎం జగన్

మిజాంగ్ తుఫాన్ హెచ్చరికలతో సీఎం జగన్ వెంటనే అప్రమత్తమై అధికారులను అలర్ట్ చేయడంతో స్వల్ప నష్టంతో ప్రజలు బయటపడ్డారు. కానీ వరద బాధితులను నేరుగా పరామర్శించలేకపోతున్నానని

Mahesh Babu, Ram Charan: సీఎం రేవంత్ రెడ్డికి మహేష్, చరణ్ ప్రత్యేక అభినందనలు

తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయనతో పాటు మంత్రులు కూడా ప్రమాణం చేశారు.