ఆ పనిచేయడానికి రెండు వారాలు గ్యాప్ తీసుకున్నా: నందితా శ్వేత
Send us your feedback to audioarticles@vaarta.com
ఎక్కడికి పోతావు చిన్నవాడా?, ప్రేమకథా చిత్రమ్ 2 వంటి సినిమాల్లో దెయ్యం పాత్రలతో మెప్పించిన నందితా శ్వేతా ఇటు తెలుగు, అటు తమిళ చిత్రాలతో ఫుల్ బిజీ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ‘ఐపీసీ 376’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం నందితా శ్వేత యాక్షన్ సన్నివేశాల్లోనూ నటించారట. ముఖ్యంగా అండర్ వాటర్ యాక్షన్ సీన్ చేయాల్సి వచ్చిన్నప్పుడు ఆమె ఎలా ఫీలయ్యారనే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
‘‘‘ఐపీసీ 376’ సినిమాలో ఓ అండర్ వాటర్ సన్నివేశం చేయాలని దర్శకుడు రామ్ కుమార్ సుబ్బరామ చెప్పగానే భయపడ్డాను. ఎందుకంటే నాకు ఈత రాదు. అయితే బాగా ఆలోచించాను. చాలా కీలకమైన సన్నివేశం. అయితే నాకు నాకు సైనటిస్ సమస్య కూడా ఉండటంతో ఎలా అనుకున్నాను. ఈలోపు షెడ్యూల్ చిత్రీకరణకు చెన్నై దగ్గర ఓ వాటర్ ఫాల్ వరకు ధైర్యంగా వెళ్లాను. కానీ నీళ్లలోకి దూకడానికి భయపడ్డాను. ఫైట్ మాస్టర్ తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఏమీ కాదని ఆయన చెప్పినా ఎందుకనో నాకు ధైర్యం లేకపోయింది. దాంతో లొకేషన్ నుండి బయటకు వచ్చేశాను. రెండు వారాల పాటు బ్రేక్ తీసుకుని బెంగుళూరు వెళ్లాను. ఎందుకో తెలుసా? ఈత నేర్చుకోవడానికి.. మొదటి మూడు రోజులు చాలా ఇబ్బందులే పడ్డాను. నీళ్లు కూడా ఎక్కువగా మింగేశాను. అయితే నాలుగో రోజు నుండి నెమ్మదిగా అలవాటు పడుతూ వచ్చాను. ఇప్పుడు నాకు నీళ్లంటే భయం లేదు’’ అని అన్నారు నందితా శ్వేత.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com